‘కోతి’పిల్లకు బర్త్‌డే సెలబ్రేషన్స్..

కోతికి పుట్టిన రోజు వేడుకలేంటీ అని ఆశ్చర్యపోతున్నారా..? నిజమే.. చిన్నప్పటి నుంచి సాకిన కోతిపిల్లకు బర్త్‌డే వేడుకలు నిర్వహించాడు దాని యజమాని. కర్నూలు జిల్లా సంజామాల గ్రామానికి చెందిన రాముడు స్థానికంగా నివసముంటున్నాడు. అయితే.. మూడేళ్ల క్రితం ఆంజనేయ స్వామి దేవాలంయ వద్ద ఓ తల్లి వానరం పిల్లకు జన్మనిచ్చి కాసేపటికి చనిపోయింది. పిల్ల కోతి పరిస్థితి గమనించిన రాముడు.. దాన్ని ఇంటికి తీసుకెళ్లి పాలుపట్టి ఆకలి తీర్చాడు. చిన్నపిల్లలకు చేసిన విధంగా సపర్యలు చేశాడు. దీంతో […]

'కోతి'పిల్లకు బర్త్‌డే సెలబ్రేషన్స్..
Follow us

| Edited By:

Updated on: Jun 24, 2019 | 10:03 AM

కోతికి పుట్టిన రోజు వేడుకలేంటీ అని ఆశ్చర్యపోతున్నారా..? నిజమే.. చిన్నప్పటి నుంచి సాకిన కోతిపిల్లకు బర్త్‌డే వేడుకలు నిర్వహించాడు దాని యజమాని. కర్నూలు జిల్లా సంజామాల గ్రామానికి చెందిన రాముడు స్థానికంగా నివసముంటున్నాడు. అయితే.. మూడేళ్ల క్రితం ఆంజనేయ స్వామి దేవాలంయ వద్ద ఓ తల్లి వానరం పిల్లకు జన్మనిచ్చి కాసేపటికి చనిపోయింది.

పిల్ల కోతి పరిస్థితి గమనించిన రాముడు.. దాన్ని ఇంటికి తీసుకెళ్లి పాలుపట్టి ఆకలి తీర్చాడు. చిన్నపిల్లలకు చేసిన విధంగా సపర్యలు చేశాడు. దీంతో మూడేళ్లుగా ఆ కోతి అతని వద్దే ఉంటోంది. రామాయణంలో రాముడికి నమ్మిన బంటు హనుమంతునిలా.. ఈ రాముడికి కూడా నమ్మిన బంటుగా మారి ఆయన ఎక్కడికి వెళ్లినా.. వెంటే వెళుతోంది. ఇక దానికి పుట్టిన రోజును గుర్తుపెట్టుకుని ప్రతీయేటా కోతికి జన్మదిన వేడుకలు జరుపుతున్నాడు రాముడు.