సూర్య, మోహన్‌లాల్ పాత్రలు రివీల్
సూర్య, కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘కాప్పాన్’. మలమాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో మోహన్ లాల్, తన పాత్రలపై వివరణ ఇచ్చాడు సూర్య. తాను ఫస్ట్ ర్యాంక్ ఎస్పీజీ(స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్)ఆఫీసర్‌గా కనిపించనున్నానని, మోహన్ లాల్ ప్రధానమంత్రి పాత్రలో నటించారని సూర్య వెల్లడించాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఆగష్టు లేదా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నట్లు సూర్య […]
సూర్య, కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘కాప్పాన్’. మలమాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో మోహన్ లాల్, తన పాత్రలపై వివరణ ఇచ్చాడు సూర్య. తాను ఫస్ట్ ర్యాంక్ ఎస్పీజీ(స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్)ఆఫీసర్‌గా కనిపించనున్నానని, మోహన్ లాల్ ప్రధానమంత్రి పాత్రలో నటించారని సూర్య వెల్లడించాడు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఆగష్టు లేదా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నట్లు సూర్య తెలిపాడు. కాగా ఈ చిత్రంలో సూర్య సరసన సాయేషా సైగల్ నటించగా.. ఆర్య, సముద్ర ఖని కీలక పాత్రలలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హారీశ్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు.