హెచ్‌సీఏ అధ్యక్ష పదవి రేసులో అజారుద్దీన్

Mohammad Azharuddin files nomination for HCA president post, హెచ్‌సీఏ అధ్యక్ష పదవి రేసులో అజారుద్దీన్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్ష పదవి రేసులో టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ పోటీపడుతున్నారు. ఇందుకోసం గురువారం ఆయన నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. అయితే గతంలో కూడా ఈ పదవి కోసం దాఖలు చేసి.. తిరస్కరణకు గురయ్యారు. 2017లో హెచ్సీఏ అధ్యక్ష పదవికి అజారుద్దీన్ నామినేషన్ వేసినా.. హెచ్‌సీఏ సున్నితంగా తిరస్కరించింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, జీవిత కాలం పాటు నిషేధం ఉండడంతో అప్పుడు నామినేషన్‌ను అధికారులు రిజెక్ట్ చేశారు. అయితే అప్పటికే ఆయనపై బీసీసీఐ నిషేధం ఎత్తివేస్తూ.. అతడికి క్లీన్‌చిట్ ఇచ్చింది. అయితే ఆ క్లీన్‌చిట్‌కి సంబంధించిన పత్రాలను నామినేషన్‌తో పాటు సమర్పించలేదు. దీంతో పత్రాలు సమర్పించని కారణంగా నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో.. అప్పుడు జరిగిన ఆ అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సారి మరి ఏం జరగబోతుందో అన్నది తెలియాలి. గతంలోనే 2019లో ఖచ్చితంగా నామినేషన్ వేస్తానన్న అజారుద్దీన్.. అలానే చేశారు. ఈ నెల 27న హెచ్‌సీఏ ఎన్నికలు జరగనున్నాయి. మరి పదవి వరిస్తుందా లేదా అన్నది వేచిచూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *