మోదీలో మరో కోణం

కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్ రద్దు. ఇప్పుడిదే అంశం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఐతే రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో.. ప్రకృతి ఒడిలో సేద తీరిన ప్రధాని మోదీ. ఏంటి. కశ్మీర్ అంశంలో ఇంత హాట్ హాట్ గా ఉంటే..ఇప్పుడు సరదాగా గడుపుతున్నారా..? అనుకుంటున్నారా..? అసలు విషయమేంటంటే డిస్కవరీ ఛానల్ లో ప్రసారం కానున్న పాపులర్ షో మ్యాన్ వర్సెస్ వైల్డ్..త్వరలో మనముందుకు రాబోతోంది. […]

మోదీలో మరో కోణం
Follow us

|

Updated on: Aug 09, 2019 | 7:35 PM

కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్ రద్దు. ఇప్పుడిదే అంశం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఐతే రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో.. ప్రకృతి ఒడిలో సేద తీరిన ప్రధాని మోదీ. ఏంటి. కశ్మీర్ అంశంలో ఇంత హాట్ హాట్ గా ఉంటే..ఇప్పుడు సరదాగా గడుపుతున్నారా..? అనుకుంటున్నారా..? అసలు విషయమేంటంటే డిస్కవరీ ఛానల్ లో ప్రసారం కానున్న పాపులర్ షో మ్యాన్ వర్సెస్ వైల్డ్..త్వరలో మనముందుకు రాబోతోంది.  ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డిస్కవరీ ఛానల్ రూపొందించిన ఈ షోలో బేర్ గ్రిల్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు మోదీ. ఇప్పటికే ఆ ఛానల్ ప్రోమో రిలీజ్ చేసి..షోపై హైప్ క్రియేట్ చేసింది.

ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో సాహసవీరుడు బేర్ గ్రిల్స్ తో కొద్దిసేపు గడిపారు ప్రధాని మోదీ. కాకులు దూరని కారడవుల్లో ప్రధాని మోదీ చేసిన  సాహసాలను మరో రెండ్రోజుల్లో మనం చూడబోతున్నాం.  వీరిరువురూ చేసిన జర్నీ ఈ నెల 12న 180 దేశాల్లో..8 భాషల్లో..ఇంగ్లీష్, బెంగాలీ, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లో ప్రసారం కాబోతోంది. దీంతో నమో అడవుల్లో ఏం చేశారు..? ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చారోనని ఆసక్తి నెలకొంది.

ఐతే వన్యప్రాణులను ఎలా సంరక్షించాలి, పర్యావరణ మార్పులపై ఈ షోలో వివరించబోతున్నట్లు తెలుస్తోంది.  తనతో కలిసి మోదీ చేసిన ఈ షో ఆగస్ట్ 12న ప్రసారం కాబోతున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు బేర్ గ్రిల్స్. మోదీ తనతో కలిసి ఎలాంటి సాహసాలు చేశారో చూడాలని కోరుకుంటున్నానన్నారు. మోదీలో కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నట్లు చెప్పి ఈ షోపై ఆసక్తిని పెంచేశాడు.   బేర్ గ్రిల్స్ ట్వీట్ ను రీ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. భారత్ లో ఉన్న అద్భుత ప్రదేశాలను ఈ ప్రోగ్రాంలో చూడొచ్చని స్పష్టం చేశారు. దీంతో ఈ షో కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి 180 దేశాలు.

ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ప్రధాని మోదీ..వాటన్నిటికీ దూరంగా కాసేపు ప్రకృతి ఒడిలో సేద తీరారు. బేర్ గ్రిల్స్ తో కలిసి సాహసాలు చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ గురించి బేర్ గ్రిల్స్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మోదీ.. ప్రజలే దేశాన్ని శుభ్రం చేస్తారు. వ్యక్తిగత శుభ్రత భారతీయ సంస్కృతిలో భాగం..కానీ  సామాజిక పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలి. మహాత్మాగాంధీ క్లీన్ ఇండియా కోసం చాలా కృషి చేశారు. ఇందులో విజయ సాధిస్తున్నాం. త్వరలో సంపూర్ణ స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందన్నారు.