వాటే డిఫరెన్స్ ? ఒకరిది అభివృధ్ది మంత్రం.. మరొకరిది ‘ యుధ్ధ తంత్రం ‘ !

తమ దేశాల స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా భారత ప్రధాని మోదీ, పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగాలను ఒక్కసారి చూస్తే..వీటిలో ఎంత తేడా ఉందో విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మోదీ ఒక్కసారైనా పాకిస్తాన్ లేదా ఇమ్రాన్ ఖాన్ గురించి ఒక్క మాటకూడా మాట్లాడక పోగా.. తన 92 నిముషాల ప్రసంగంలో ఆయన దేశ అభివృధ్ది, జనాభా అదుపు, నీటి ఆవశ్యకత, 370 అధికరణం రద్దు వంటి వివిధ అంశాలను ప్రస్తావిస్తే.. ఇమ్రాన్ మాత్రం తన ప్రసంగంలో […]

వాటే  డిఫరెన్స్ ? ఒకరిది అభివృధ్ది మంత్రం.. మరొకరిది ' యుధ్ధ తంత్రం ' !
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2019 | 4:53 PM

తమ దేశాల స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా భారత ప్రధాని మోదీ, పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగాలను ఒక్కసారి చూస్తే..వీటిలో ఎంత తేడా ఉందో విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మోదీ ఒక్కసారైనా పాకిస్తాన్ లేదా ఇమ్రాన్ ఖాన్ గురించి ఒక్క మాటకూడా మాట్లాడక పోగా.. తన 92 నిముషాల ప్రసంగంలో ఆయన దేశ అభివృధ్ది, జనాభా అదుపు, నీటి ఆవశ్యకత, 370 అధికరణం రద్దు వంటి వివిధ అంశాలను ప్రస్తావిస్తే.. ఇమ్రాన్ మాత్రం తన ప్రసంగంలో భారత్ పట్ల విషం కక్కాడు. మోదీ స్పీచ్ కి పూర్తి విరుధ్ధంగా సాగింది ఆయన ప్రసంగం.

మోదీ ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు.. ప్రజలు, అభివృధ్ది అన్న పదాలను ఆయన 47 సార్లు నొక్కి చెప్పారు. జల వినియోగం, జల జీవన్ కమిషన్, జనాభా అదుపు, టూరిజం, భారత ఆర్ధిక ప్రగతి, జమ్మూ కాశ్మీర్ స్వయం నిర్ణయాధికారానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370, 35 ఏ రద్దు,.. ఇలా పలు అంశాలపై ఆయన ప్రసంగం సాగింది. ఆగస్టు 19 న జరగనున్న ఆఫ్ఘనిస్తాన్ 100 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని కూడా ఆయన ప్రస్తావించి ఆ దేశానికి తన శుభాకాంక్షలు చెప్పారు. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంకలో ఉగ్రదాడులు, భారత్ ను పీడిస్తున్న ఈ సమస్యగురించి మోదీ పేర్కొన్నప్పటికీ.. ఈ సందర్భంగా మాత్రం పాక్ గురించి నోరెత్తలేదు. ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. (భారత 73 వ స్వాతంత్య్ర దినోత్సవాలు ఆగస్టు 15 న, పాక్ ఇండిపెండెన్స్ డే ఉత్సవాలు అంతకుముందు రోజు.. ఆగస్టు 14 న జరిగాయి).

అయితే ఇమ్రాన్ ఖాన్ మాత్రం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ముజఫరాబాద్ లో మాట్లాడుతూ.. ఎంతసేపూ కాశ్మీర్ అంశం మీద, మోదీ మీద నోరు పారేసుకున్నారు. 370 అధికరణాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేసి పెద్ద తప్పు చేసిందన్నారు. ‘ ఐడియాలజీ ‘ అన్న పదాన్ని ఇమ్రాన్ 23 సార్లు, కాశ్మీర్ పదాన్ని 20 సార్లు వాడారు. నాజీలకు, బీజేపీ ‘ సిధ్ధాంత కర్త ‘ అయిన ఆర్ ఎస్ ఎస్ కు మధ్య ఒకే విధమైన ఐడియాలజీ ఉందన్నారు. తమ దేశ ప్రజలగురించి మాట్లాడే బదులు.. కాశ్మీర్ ప్రజల గురించి, వారి భవితవ్యం గురించి ఎక్కువగా ఇమ్రాన్ పదేపదే ప్రస్తావించి భారత్ పట్ల తన అక్కసును వెలిగక్కారు. పీఓకేపై మళ్ళీ ఇండియా దాడి చేసినా చేయవచ్చు అని వ్యాఖ్యానించారు. తమ దేశ ఇండిపెండెన్స్ డే సందర్భాన్ని ఆయన ఈ రకంగా వినియోగించుకున్నారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం రాత్రి కూడా ఇమ్రాన్ ఖాన్.. ఫోన్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడుతూ కాశ్మీర్ అంశాన్ని ముఖ్యంగా ప్రస్తావించారు. అదే సందర్భంలో ఈ విషయంలో ఇండియా తమ దేశం పట్ల ‘ దారుణంగా ‘ వ్యవహరిస్తోందని వాపోయారు. అవసరమైతే ఈ అంశంలో మీరు జోక్యం చేసుకుని మాకు సాయపడాలన్నట్టుగా ఆయన అభ్యర్థన కొనసాగింది. ఇందుకు ట్రంప్ కూడా ‘ సానుకూలంగా ‘ స్పందించారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. అయితే కాశ్మీర్ విషయంలో మూడో దేశ మధ్యవర్తిత్వం తమకు అవసరం లేదని మోదీ ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టం చేస్తోంది.