తొలిసారి వెన్నుచూపిన మోడీ సర్కార్ …ఎక్కడంటే..?

మహాత్మా గాంధీ 150వ జయంతి.. బుధవారం నుంచి దేశవ్యాప్తంగా ఒకసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ వస్తువులను(సింగిల్ యూజ్ ప్లాస్టిక్) నిషేధించాలన్న తన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది. అసలే ఆర్థిక మందగమనం, ఉద్యోగాల తొలగింపు వంటి అంశాలు దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రస్తుత తరుణంలో పారిశ్రామిక రంగానికి ప్లాస్టిక్ వస్తువుల నిషేధాన్ని అమలు చేయడం వల్ల ప్లాస్టిక్ రంగానికి తీవ్ర విఘాతం ఏర్పడగలదన్న ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదనను రద్దు చేసినట్లు పర్యావరణ మంత్రిత్వశాఖలోని సీనియర్ అధికారి చంద్ర కిశోర్ […]

తొలిసారి వెన్నుచూపిన మోడీ సర్కార్ ...ఎక్కడంటే..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 02, 2019 | 12:42 PM

మహాత్మా గాంధీ 150వ జయంతి.. బుధవారం నుంచి దేశవ్యాప్తంగా ఒకసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ వస్తువులను(సింగిల్ యూజ్ ప్లాస్టిక్) నిషేధించాలన్న తన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది. అసలే ఆర్థిక మందగమనం, ఉద్యోగాల తొలగింపు వంటి అంశాలు దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రస్తుత తరుణంలో పారిశ్రామిక రంగానికి ప్లాస్టిక్ వస్తువుల నిషేధాన్ని అమలు చేయడం వల్ల ప్లాస్టిక్ రంగానికి తీవ్ర విఘాతం ఏర్పడగలదన్న ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదనను రద్దు చేసినట్లు పర్యావరణ మంత్రిత్వశాఖలోని సీనియర్ అధికారి చంద్ర కిశోర్ మిశ్రా వెల్లడించారు. ఒకసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు, ప్లేట్లు, చిన్న బాటిళ్లు, స్ట్రాలు, కొన్ని రకాల సాచెట్లపై ఇప్పట్లో నిషేధం ఉండదని ఆయన చెప్పారు. అయితే, నిషేధం విధించనప్పటికీ వీటి వాడకాన్ని నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. పాలిథిన్ బ్యాగులు, స్టైరోఫోమ్ వంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, నిల్వ, వాడకంపై ఆంక్షలు విధించవలసిందిగా రాష్ట్రాలను కేంద్రం కోరనున్నట్లు ఆయన చెప్పారు.

ప్లాస్టిక్ వాడకంలోని దుష్ప్రభావాల గురించి ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ప్రజలలో అవగాహన తీసుకురావడానికే స్వచ్ఛతాహీ సేవా ప్రచారాన్ని చేపట్టామని, ప్లాస్టిక్ నిషేధానికి కాదని ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్న ప్రభుత్వం ఇదివరకు తీసుకున్న నిర్ణయంపై తమ వస్తువుల ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్ కీలక పాత్ర పోషించే కొన్ని పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేశాయి. కొన్ని వస్తువుల ప్యాకేజింగ్‌కు ప్రత్యామ్నాయం లేదని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సిఐఐ) పేర్కొంది. ఫార్మా లేదా హెల్త్ ప్రాడక్ట్ ప్యాకింగ్‌లో చిన్న ప్లాస్టిక్ సీసాలకు ప్రత్యామ్నాయం లేదని, అదే విధంగా బిస్కట్లు, ఉప్పు, పాలు, కెచప్, షాంపూ, సోడా తదితర అనేక వస్తువులను ప్లాస్టిక్‌లోనే సరఫరా చేయాల్సి ఉంటుందని సిఐఐ తెలిపింది.