తిరుపతికి మోదీ గిఫ్ట్.. ఏంటంటే?

టెంపుల్ సిటీ తిరుపతి బంపర్ గిఫ్ట్ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టెంపుల్ సిటీకి తరచూ వీఐపీలు వస్తూ, పోతూ వుండడంతో ఎయిర్‌పోర్టుకు కొత్త హంగులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ భేటీ నిర్ణయించింది. బుధవారం మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. తిరుపతి ఎయిర్‌పోర్టు కు కొత్త హంగులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రేణిగుంటలోని తిరుపతి విమానాశ్రయంలో కొత్తగా వీఐపీ సెర్మోనియల్ లాంజ్ […]

తిరుపతికి మోదీ గిఫ్ట్.. ఏంటంటే?
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 27, 2019 | 1:46 PM

టెంపుల్ సిటీ తిరుపతి బంపర్ గిఫ్ట్ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టెంపుల్ సిటీకి తరచూ వీఐపీలు వస్తూ, పోతూ వుండడంతో ఎయిర్‌పోర్టుకు కొత్త హంగులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ భేటీ నిర్ణయించింది.

బుధవారం మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. తిరుపతి ఎయిర్‌పోర్టు కు కొత్త హంగులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రేణిగుంటలోని తిరుపతి విమానాశ్రయంలో కొత్తగా వీఐపీ సెర్మోనియల్ లాంజ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం అవసరమైన ఎయిర్‌పోర్టు భూమిని ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది కేంద్ర కేబినెట్. ఎయిర్‌పోర్టు పరిధిలోని 1800 చదరపు మీటర్ల భూమిని భారత విమానాశ్రయాల ప్రాదికార సంస్థ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఏపీ కార్పొరేషన్‌కు లీజుకు ఇవ్వనుంది. ఇందుకు గాను ఏడాదికి కేవలం ఒక్క రూపాయి నామమాత్రపు లీజు ఫీజు చెల్లించాలని కేబినెట్ నిర్దేశించింది.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు భూమి ఏపీ కార్పొరేషన్‌కు బదిలీ కాగానే వీఐపీ సెర్మోనియల్ లాంజ్ నిర్మాణం ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ మధ్య కాలంలో తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి అప్‌గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ్నించి కొలంబో, దుబాయ్, కౌలాలంపూర్‌లకు విమానాలు నడుస్తున్నాయి. దానికితోడు జాతీయ, అంతర్జాతీయ స్థాయి వీఐపీలు ఈ మధ్య తరచూ తిరుపతికి శ్రీవారి దర్శనం కోసం వచ్చి, వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టు ఆవరణలో సెర్మోనియల్ లాంజ్‌ అవసరమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. దానికి అనుుణంగానే కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..