Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

బ్యాంకుల్లో బంగారంపై మోదీ నజర్..ఎక్కువుంటే అంతే సంగతి !

new gold scheme by modi, బ్యాంకుల్లో బంగారంపై మోదీ నజర్..ఎక్కువుంటే అంతే సంగతి !

బ్యాంకు లాకర్లలో బంగారం పెట్టుకుని నిశ్చింతగా వుంటున్నారా ? ఇకపై ఆ నిశ్చింతకు నీళ్ళొదలాల్సిందే. ఎందుకంటే.. దేశంలోని బ్యాంకుల్లో మూలుగుతున్న బంగారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. లెక్కలేనంతగా బంగారం కొనుక్కున్న సంపన్నులకు మోదీ సర్కార్ షాకివ్వబోతోంది. లాకర్లలో ఎంత బంగారం వుందో, బ్లాక్ మనీని బంగారంగా మార్చుకుని ఎందరు పన్ను ఎగవేస్తున్నారో లెక్క తేల్చేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఇందుకోసం కొత్త చట్టాన్నిత్వరలో జరిగే కేబినెట్ భేటీలో ప్రతిపాదించబోతున్నారు.

అమ్నెస్టీ తరహా చట్టానికి తుది మెరుగులు దిద్దుతున్నారని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. కొత్త చట్టం ప్రకారం తమ వద్ద ఎంత బంగారం వుందో వెల్లడించేందుకు ప్రతీ ఒక్క భారత పౌరునికి నిర్దిష్టమైన గడువిస్తారు. ఆ తర్వాత నేరుగా బ్యాంకుల్లో సోదాలు నిర్వహించి లాకర్లలో మగ్గుతున్న బంగారం వివరాలు సేకరిస్తారు. భారీగా ఫైన్ వసూలు చేస్తారు.

కొత్త చట్టం ప్రకారం ఒక కుటుంబానికి 4 కిలోల కంటే ఎక్కువ బంగారం వుంటే దాన్ని కేంద్రం స్వాధీనపరచుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సంస్థలైతే 20 కిలోల బంగారం వరకూ వుంచేసుకోవచ్చు. నిర్దేశిత గడువులోగా తమ వద్ద ఉన్న బంగారం ఎంతో తెలియచెబితే ఓకే.. లేకపోతే భారీగా అపరాధ రుసుములను విధించేందుకు వీలుగా కొత్త చట్టం రూపొందుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

new gold scheme by modi, బ్యాంకుల్లో బంగారంపై మోదీ నజర్..ఎక్కువుంటే అంతే సంగతి !

బ్యాంకుల్లో పనిచేసే బంగారం వాల్యూయర్ సర్టిఫికేట్లను ముందుగా పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది. భారతీయ వివాహిత స్త్రీలకు బంగారంతో అలవికాని అనుబంధం వున్న దృష్ట్యా సెంటిమెంటును కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే చాన్స్ కనిపిస్తోంది. భారత దేశం ప్రతీ ఏటా 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇందుకోసం రెండున్నర లక్షల కోట్ల రూపాయలను అంటే 35 బిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది.

ఫలితంగా భారీ స్థాయిలో విదేశీ మారక నిల్వలు హరించుకుపోతున్నాయని కేంద్రం భావిస్తోంది. పలు ఎగుమతుల ద్వారా ఆర్జిస్తున్న విదేశీ మారక నిల్వలు బంగారం కోసం హరించుకుపోవడం కరెక్టు కాదని మోదీ భావిస్తున్న నేపథ్యంలో కొత్త చట్టం తెచ్చేందుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం.

new gold scheme by modi, బ్యాంకుల్లో బంగారంపై మోదీ నజర్..ఎక్కువుంటే అంతే సంగతి !

త్వరలో గోల్డ్ బోర్డ్

ఆర్థిక, రెవెన్యూ శాఖల ప్రతిపాదన మేరకు దేశంలో కొత్తగా గోల్డ్ బోర్డును ఏర్పాటు చేసేందుకు కూడా రంగం సిద్దమవుతోంది. ఈ బోర్డులో ప్రభుత్వ అధికారులతోపాటు ప్రైవేటు సెక్టర్ వ్యక్తులతో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఆకర్షనీయమైన బంగారం పథకాలను, గోల్డు బాండ్ల పథకాలను రూపొందించడంతోపాటు ప్రజలను పెద్ద ఎత్తున పెట్టుబడులకు ప్రోత్సహించడమే ఈ గోల్డు బోర్డు బాధ్యత అని భావిస్తున్నారు. భారతీయ ప్రధాన ఆలయాల్లో లెక్కలేనంతగా బంగారం నిల్వలు పేరుకుపోయాయి. ఒక్క తిరుమలేశుని ఖజానాలోనే టన్నుల కొద్దీ బంగారం పడి మూలుగుతోంది. ప్రతీ రోజుల ఇంకా ఎందరో ఆలయాలకు బంగారాన్ని దానంగా ఇస్తుండడంతో నిల్వలు భారీగా, వేగంగా పెరుగుతున్నాయి.

డిసెంబర్ 2 నుంచి బంగారం బాండ్లు ?

అక్టోబర్ 25వ తేదీన నిలిపేసిన బంగారం సావరీన్ బాండ్ల జారీని డిసెంబర్ 2న ప్రారంభించి, నాలుగు రోజుల పాటు కొనసాగించాలని, డిసెంబర్ ఆరవ తేదీన బాండ్ల జారీని క్లోజ్ చేయాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఈ కొత్త ప్రతిపాదనలను గత నెలలోనే రూపొందించినప్పటికీ.. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల దృష్ట్యా కొద్దిగా వాయిదా వేసినట్లు సమాచారం. త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ భేటీలో మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం వుందని తెలుస్తోంది.