మోదీ వైఖరితో ఖంగుతిన్న జగన్.. ఏం జరిగిందంటే?

ఏపీ ప్రభుత్వానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరోసారి షాకిచ్చింది. గతంలో చేసిన ప్రకటననే చట్టసభ వేదికగా మరోసారి తెలియజేసి, తమ వైఖరేంటో క్రిస్టల్ క్లియర్‌గా తేల్చి చెప్పింది మోదీ సర్కార్. దీంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పున:సమీక్షించాలన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్రం మరోసారి మోకాలడ్డినట్లయ్యింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ముట్టడానికి వీల్లేనివని కేంద్రం పునరుద్ఘాటించింది. విద్యుత్ ఒప్పందాలలో అక్రమాలు చోటు చేసుకుంటే తప్ప ఒప్పందం మార్చడం కుదరదని ఖరాఖండీగా చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం. […]

మోదీ వైఖరితో ఖంగుతిన్న జగన్.. ఏం జరిగిందంటే?
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 21, 2019 | 5:20 PM

ఏపీ ప్రభుత్వానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరోసారి షాకిచ్చింది. గతంలో చేసిన ప్రకటననే చట్టసభ వేదికగా మరోసారి తెలియజేసి, తమ వైఖరేంటో క్రిస్టల్ క్లియర్‌గా తేల్చి చెప్పింది మోదీ సర్కార్. దీంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పున:సమీక్షించాలన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్రం మరోసారి మోకాలడ్డినట్లయ్యింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ముట్టడానికి వీల్లేనివని కేంద్రం పునరుద్ఘాటించింది.

విద్యుత్ ఒప్పందాలలో అక్రమాలు చోటు చేసుకుంటే తప్ప ఒప్పందం మార్చడం కుదరదని ఖరాఖండీగా చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం. విజయవాడ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి గురువారం లోక్‌సభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఇండియన్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కోడ్ 2010 ప్రకారం విద్యుత్తు పంపిణీ సంస్థలు నడచుకోవాల్సి వుందని పేర్కొన్నారు. ఆ మేరకు కుదుర్చుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాల్సి వుందని తెలిపారు.

పవన, సౌర విద్యత్తు ఉత్పత్తిదారులకు బకాయిలు చెల్లించాలని హైకోర్టు గతంలోనే ఆదేశించింది. అయినా సరే ఏపీ సర్కారు చెల్లింపులు చేయకుండా రిట్ అప్పీల్ దాఖలు చేసింది. చెల్లింపుల్లో జాప్యం జరగకుండా లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ)లు జారీ చేయాలని కేంద్రం సూచించింది. ఇది విద్యుత్ ఒప్పందాల్లో క్లియర్‌గా పేర్కొన్నారు.

అయినా సరే ఎల్సీలు జారీ చేయకపోవడంతో విద్యుదుత్పత్తిదారులకు బకాయిలు పేరుకుపోయాయి. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. కోర్టు తదుపరి ఉత్తర్వుల కోసం కేంద్రం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్న ఇవాళ లోక్‌సభ ముందుకు వచ్చింది. దానికి కేంద్రం పైవిధంగా స్పందించింది.