#COVID2019 ప్రవాస భారతీయులపై ప్రత్యేక పోకస్.. మోదీ ఏం చేశారంటే?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవాస భారతీయులపై ఫోకస్ చేశారు. విదేశాలలో స్థిరపడిన, వర్క్ చేస్తున్న, చదువుకుంటున్న, పర్యాటకులుగా వెళ్ళి కరోనా ప్రభావంతో విదేశాలలో చిక్కుకుపోయిన వారికి సాయమందించే దిశగా కీలక చర్యలకు ప్రధానమంత్రి ఉపక్రమించారు.

#COVID2019 ప్రవాస భారతీయులపై ప్రత్యేక పోకస్.. మోదీ ఏం చేశారంటే?
Follow us

|

Updated on: Mar 31, 2020 | 4:36 PM

Narendra Modi focusing on non resident Indians: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవాస భారతీయులపై ఫోకస్ చేశారు. విదేశాలలో స్థిరపడిన, వర్క్ చేస్తున్న, చదువుకుంటున్న, పర్యాటకులుగా వెళ్ళి కరోనా ప్రభావంతో విదేశాలలో చిక్కుకుపోయిన వారికి సాయమందించే దిశగా కీలక చర్యలకు ప్రధానమంత్రి ఉపక్రమించారు. అందుకోసం పలు దేశాల్లో వున్న ఇండియన్ అధికార యంత్రాంగం, వివిధ మిషన్లలో విదేశాలలో పని చేస్తున్న సంస్థల అధిపతులతో ప్రధాని రెగ్యులర్‌గా సంప్రదింపులు జరుపుతూ సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.

ప్రధాన మంత్రి ఆదేశాలతో విదేశాంగ శాఖ పని విభజన చేసుకుంది. సోమవారం రాత్రి మొత్తం 130 మంది విదేశీ దౌత్యవేత్తలు, వివిధ మిషన్లకు సారథ్యం వహిస్తున్న వారితో నేరుగా మాట్లాడారు ప్రధాన మంత్రి. ఆయా దేశాలలో భారతీయుల పరిస్థితిని మోదీ వాకబు చేశారు. ఆయా దేశాలలో దీర్ఘకాలంగా స్థిరపడిన వారి కంటే.. చదువుల కోసం, తాత్కాలిక ఉద్యోగాల కోసం, పర్యాటకులుగాను వెళ్ళి అక్కడ లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించాలని ప్రధాని ఆదేశాలు జారీ చేశారు.

ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించాలని, పర్యాటకులుగా వెళ్ళి చిక్కుకుపోయిన వారికి షెల్టర్ కల్పించాలని ప్రధానమంత్రి సూచించారు. విద్యార్థులు తమ తమ హాస్టళ్ళను ఖాళీ చేసి.. ఎక్కడా షెల్టర్ దొరక్క ఇబ్బందులు పడుతూ వుంటే వారికి ఆశ్రయం కల్పించాలని మోదీ సూచించారు. అదే సమయంలో ఆయా దేశాలలో కరోనా కట్టడికి తీసుకుంటున్న బెస్ట్ ప్రాక్టీసెస్‌ని తెలుసుకుని ఇండియన్ ఎంబసీలకు తెలియజేయాలని, వీలైన పక్షంలో వాటిని ఇండియాలో అమల్లోకి తెచ్చి.. ఈ కరోనా కష్ట కాలంలో బయటపడేలా చూస్తామని మోదీ వారికి వివరించినట్లు తెలుస్తోంది.