Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

తీరు మారని పాకిస్తాన్.. ప్రధాని మోదీ నిర్ణయంతో షాక్

జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని రద్దు చేస్తూ.. అదే సమయంలో ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పాకిస్థాన్‌ని కుదిపివేసింది. అసలు ఈ నిర్ణయాల్లో ఏది కూడా ద్వైపాక్షిక ఒప్పందాల ఉల్లంఘన కానే కాదు. ఇది పూర్తిగా మోదీ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి లోబడి తీసుకున్న నిర్ణయం.

అయితే 70 ఏళ్ళ భారత అంతర్గత కాశ్మీర్ వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనాలన్న ప్రతిపాదనను పాక్ సహించలేకపోతోంది. పైగా తన దేశ అభివృధ్ది పట్ల సొంత ప్రజల దృష్టిని మళ్లించడమే తన పాలసీగా పెట్టుకుంది. ఇస్లామిక్ దేశాల నుంచే గాక.. యుఎస్ నుంచి కూడా తమ మనుగడ కోసం.. నిధులకోసం కాశ్మీర్ సమస్యను ఆ దేశం వినియోగించుకోజూస్తోంది. ఇది దశాబ్దాల తరబడి సాగుతోంది.

ఫ్రీడం స్ట్రగుల్ అన్న నిరాధారమైన నినాదం పేరిట పాకిస్తాన్ స్థానిక యువతను ఉగ్రవాదులుగా మార్చేందుకు శిక్షణనిస్తున్న విషయం జగమెరిగిన సత్యం. సరిహద్దుల్లో తమ ఉగ్రవాదులు చొరబడేలా ఆ దేశం చేయని ప్రయత్నమంటూ లేదు. అలాగే భారత జవాన్లపై దాడులు చేయడానికి, కాశ్మీర్లో అశాంతిని రెచ్చగొట్టడానికి పాక్ చేస్తున్న కుతంత్రాలు అందరికి తెలిసిందే. 72 ఏళ్లుగా భారత దేశాన్ని అస్థిరపరచేందుకు పాక్ శతవిధాలా యత్నిస్తోంది. జమ్మూ కాశ్మీర్ విషయంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో ఆ దేశం షాక్ తిన్నది.

ఇండియాతో యుధ్ధాన్ని కోరుతున్నా .. ఏ యుధ్ధంలోనూ గెలవలేకపోయింది. కునారిల్లుతున్న తన దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టుకోలేక యుధ్ధం బూచిని చూపుతున్న పాక్.. ఇండియాను ఎంతగా కవ్వించాలని అనుకుంటున్నా .. దాని యత్నాలు నిష్ఫలమవుతున్నాయి. భారత్ శాంతి దేశం అన్న విషయం ఆ దేశానికీ తెలుసు. 1947 లో స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ సదా శాంతి కాముక దేశం ఇండియా.

ఏ దేశంతోనూ యుధ్ధానికి తలపడలేదు. ఏదేశాన్నీ రెచ్ఛగొట్టలేదు. భారత దేశాన్ని ఒక్క పాక్ తప్ప అన్ని దేశాలూ గౌరవిస్తున్నాయి. అలాగే భారత సైన్యం విశిష్టత కూడా ప్రపంచ దేశాలకు తెలుసు. కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ ఎన్నిసార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందో ఒక్కసారి చరిత్ర రికార్డులు చూస్తే అర్థమవుతుంది.

ఇండియాకున్న సైనిక శక్తి అపారం. అత్యంత ఆధునాతన యుధ్ధ వ్యూహాల్లో మన సాయుధ దళాల సత్తా అనిర్వచనీయం. ఎప్పుడైనా యుధ్ధానికి సిధ్ధంగా ఉండడం దీని ప్రత్యేకత. కానీ పాక్ విషయం అలా కాదు. సామాజికంగా, ఆర్థికంగా విఫలమైన ఆ దేశం ఏ రకంగా చూసినా మన సైనిక పాటవానికి సరితూగలేదు. బలహీనమైన కమాండ్ కంట్రోల్ ఆ దేశానిది. తన రాజకీయ మనుగడ కోసం పాకిస్థాన్ ఇండియాతో కయ్యానికి కాలు దువ్వాలన్నా.. ఈ ‘ వీక్ ‘ కమాండ్ దృష్ట్యా వెనుకంజ వేస్తోంది. అయినా ఒకవేళ ఆ ప్రయత్నమే చేస్తే చావుదెబ్బ తినడం ఖాయం.

Disclaimer: రచయిత బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి.. ఆర్టికల్ లో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం. పార్టీ అభిమతం. వాటితో టీవీ 9 వెబ్ సైట్ కి ఎలాంటి సంబంధం లేదు. వాటిని టీవీ 9 వెబ్ సైట్ ఉద్దేశాలుగా భావించవద్దని మనవి.