Breaking News
  • అమరావతి: ‘నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ–2020’ పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష: జాతీయ విద్యా విధానం–2020లో ఏం ప్రస్తావించారు? రాష్ట్రంలో ప్రస్తుత విద్యా విధానం ఎలా ఉంది? వంటి అన్ని అంశాలపై వివరించిన అధికారులు. సమీక్షలో సీఎం జగన్ మోహన్ రెడ్డి. అన్ని కాలేజీలు మూడేళ్లలో పూర్తి ప్రమాణాలు సాధించి ఎన్‌ఏసీ,ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ పొందాలి. కాలేజీల్లో ప్రమాణాలపై ఎస్‌ఓపీలు ఖరారు చేసి అన్ని కాలేజీలలో రెగ్యులర్‌గా తనిఖీలు చేయండి. 30 మందితో 10 బృందాలు ఏర్పాటు చేయండి టీచర్‌ ట్రెయినింగ్‌ కాలేజీలపై దృష్టి పెట్టండి. ప్రమాణాలు లేకపోతే నోటీసులు ఇవ్వండి మార్పు రాకపోతే ఆ కాలేజీలను మూసి వేయండి.
  • కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో ముగ్గురికి బెయిల్. ఎమ్మార్వో నాగరాజు పై మరో కేసు నమోదు కావడంతో బెయిల్ నిరాకరించిన ఏసీబీ కోర్ట్. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆంజిరెడ్డి, శ్రీనాథ్, విఆర్ఏ సాయి రాజ్ లకు బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్ట్.
  • ట్రాయ్ కొత్త ఛైర్మన్‌గా పీడీ వాఘేలా నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం.
  • సైబరాబాద్ కమిష్నరేట్ మొయినాబాద్ పొలిస్టేషన్ పరిధిలోని హిమయత్ నగర్ లో 25వ తేది అత్మహత్య చేసుకున్న ‌మహిళ కేసును చేదించిన మొయినాబాద్ పొలీసులు . అత్మహత్యకు కారకుడైనా భతుకు మధుసుధన్ యాదవ్ ను అదునులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు . కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.
  • ఏపీ హైకోర్టుని ఆశ్రయించిన సినీ నటుడు కృష్ణంరాజు. విమానాశ్రయం విస్తరణలో 31 ఎకరాల భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన కృష్ణంరాజు. తన పొలంలో ఉన్న పంటలు, నిర్మాణాలు ఇతరత్రా వాటి విలువ కలిపి నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ లో కోరిన కృష్ణంరాజు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు.
  • చెన్నై : ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన నటుడు కమహాసన్ . ప్రముఖ గాయకుడు ఎస్పీబీ కి భారత రత్న ఇవ్వాలని ప్రధాని కి లేఖ రాసిన ఏపీ సీఎం జగన్ . ఒక గొప్ప గాయకుడికి , మా అన్నయ కి తప్పకుండ ఈ గౌరవం దక్కాలని , తమిళనాడు లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కోరుకుంటున్నారని వెల్లడి . ఈ విషయం లో ముందడుగు వేసిన ఏపీ సీఎం జగన్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.
  • తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంచూ సందీప్ కు బెయిల్ మంజూరు చేసిన NIA కోర్ట్. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 2019 డిసెంబర్ లో అరెస్ట్ అయిన సందీప్.. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న సందీప్.. ప్రస్తుతం సందీప్ పై ఐదు కేసులు నమోదు చేసిన పోలీసులు. రేపు జైలు నుండి బయటకు రానున్న సందీప్.

అయోధ్య తీర్పు నేపథ్యంలో మోదీ కీలక ఆదేశాలు.. ఏమన్నారంటే ?

prime minister crucial directions, అయోధ్య తీర్పు నేపథ్యంలో మోదీ కీలక ఆదేశాలు.. ఏమన్నారంటే ?
అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు ధర్మాసనం త్వరలో తీర్పు వెలువరిస్తుందన్న వార్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం పెరుగుతోంది. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా.. మరో వర్గం వారు రెచ్చపోతారన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో దేశంలో పలు సున్నిత ప్రాంతాల్లో బందోబస్తు పెంచుతున్నారు. అటు అయోధ్యలోనైతే గత నెల రోజులుగా రోజురోజుకు పకడ్బందీ భద్రతా చర్యలు పెంచుతూ వస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అయోధ్యలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.
అయితే, ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన  కేబినెట్ సహచరులకు, బిజెపి ముఖ్యనేతలకు, ఎంపీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత దేశంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పక్కా చర్యలు తీసుకున్న మోదీ సర్కార్ ఈసారి కూడా అలాంటి పరిస్థితినే మెయింటేన్ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. అటు ఆర్.ఎస్.ఎస్. కూడా దేశవ్యాప్తంగా వున్న సంఘ్ పరివార్ కార్యకర్తలకు, క్యాడర్‌కు, ముఖ్య నేతలకు కీలక సూచనలు చేసింది.
3,4 దశాబ్దాలుగా  కొనసాగుతున్న అయోధ్య వివాదంపై ఈనెల 11 లేదా 12వ తేదీల్లో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరిస్తుందని కథనాలొస్తున్నాయి. ఈనెల 17న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజయ్ గగోయ్ పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆలోగానే 6 ప్రధాన, కీలక కేసుల్లో తీర్పు వెలువరించేందుకు సుప్రీంకోర్టు సిద్దమవుతోంది. అందులో అత్యంత ప్రాధాన్యమైన అయోధ్య కేసు. ఈ వివాదం దశాబ్ధాలుగా కొనసాగుతుండగా.. 1992లో వివాదాస్పద కట్టడాన్ని కూల్చి వేసిన అనంతరం దేశంలో పలు చోట్ల మత ఘర్షణలు పెచ్చరిల్లిపోయాయి. ఆ తర్వాత రోజుల్లోను అది కొనసాగింది. ముఖ్యంగా 1993లో ముంబై పేలుళ్ళకు అయోధ్య కూల్చి వేత ఉదంతమే దారి తీసిందని అప్పట్లో కథనాలొచ్చాయి.
ఆ తర్వాత సుదీర్ఘ కాలం  కొనసాగిన విచారణ అనంతరం అయోధ్య వివాదంపై 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే.. అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత దేశంలో పెద్దగా ఘర్షణలు జరక్కపోవడం విశేషం. అడపాదడపా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడులు మినహా దేశంలో మత ఘర్షణలు తగ్గాయనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో అయోధ్య తీర్పు రానుండడంతో పరిస్థితి ఎలా వుంటుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే గతానికి భిన్నంగా ఈసారి అటు ముస్లిం సంస్థలు, ఇటు హిందూ సంస్థలు కూడా తీర్పు ఎలా వున్నా అంగీకరించాలన్న హితోక్తులను ప్రచారం చేస్తున్నాయి.
ఈనేపథ్యంలో బుధవారం జరిగిన మంత్రివర్గ భేటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన కేబినెట్ సహచరులకు హితోపదేశం చేశారు. అయోధ్య అంశంపై ఎలాంటి వివాదాస్పద కామెంట్లు చేయొద్దని, దేశంతో శాంతి సామరస్యాలను, శాంతి భద్రతలను పరిరక్షించుకోవాల్సిన బాధత్య ప్రతీ ఒక్కరిపైనా వుందని మోదీ చెప్పినట్లు సమాచారం. కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, బిజెపి ఎంపీలు, పలు రాష్ట్రాల్లోని బిజెపి ఎమ్మెల్యేలు తమ తమ ప్రాంతాల్లో శాంతి సామరస్యాలు కొనసాగేలా చర్యలు చేపట్టాలని మోదీతోపాటు బిజెపి చీఫ్ అమిత్ షా ఆదేశించినట్లు తెలుస్తోంది.

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పును తీర్పుగానే చూడాలని, గెలుపోటముల ప్రస్తావన రాకుండా చూడాలని మోదీ పిలుపునిచ్చారు. అయోధ్య అంశంపై మోదీ హితోపదేశం చేసిన మర్నాడే అంటే గురువారం నాడు బీజేపీ తన అధికార ప్రతినిధులు, కార్యకర్తలకు పలు సూచనలు చేసింది. భావోద్వేగ, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. అంతేకాదు, పార్లమెంటు సభ్యులు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించి శాంతి నెలకొల్పే ప్రయత్నం చేయాలని పార్టీ పేర్కొంది.
ఆర్ఎస్ఎస్ సైతం రెండు రోజుల కిందట ఇలాంటి సూచనలే చేసింది. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సంబరాలకు దూరంగా ఉండాలని సూచించింది. పలువురు ప్రముఖ ముస్లిం మతపెద్దలు, మేధావులతో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు చెందిన సీనియర్ నేతలు మంగళవారం భేటీ అయి.. అయోధ్య తీర్పు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా వచ్చినా సంయమనం పాటించాలని కోరారు.

Related Tags