Breaking News
  • చిత్తూరు: మదనపల్లెలో మహిళా సంఘాల ఆందోళన. నిందితుడిని ఉరి తీయాలంటూ చిన్నారి వర్షిత తల్లిదండ్రుల ధర్నా. తమకు న్యాయం చేయాలంటున్న వర్షిత తల్లిదండ్రులు. రఫీని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్. విద్యుత్‌ టవర్‌ ఎక్కిన వర్షిత కుటుంబ సభ్యులు. కిందకు దించేందుకు పోలీసుల ప్రయత్నాలు.
  • వివాదంలో జార్జిరెడ్డి సినిమా. ఏబీవీపీ విద్యార్థులను రౌడీలుగా చూపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపణ. సినిమాలో జార్జిరెడ్డి రౌడీయిజాన్ని చూపెట్టాలన్న ఏబీవీపీ. ఇప్పటికే ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు అనుమతి నిరాకరించిన పోలీసులు. ఈ నెల 22న విడుదల కానున్న జార్జిరెడ్డి.
  • వరంగల్‌: ఏనుమాముల మార్కెట్ యార్ట్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం. ప్రభుత్వ హామీతో తిరిగి కొనుగోళ్లు ప్రారంభించిన కాటన్ వ్యాపారులు.
  • ఢిల్లీ చేరుకున్న ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌. సా.4గంటలకు సోనియాతో భేటీ కానున్న శరద్‌పవార్‌. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు, ఉమ్మడి కార్యాచరణపై చర్చ.
  • హైదరాబాద్‌: హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ. తాకట్టు పెట్టిన అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసిన బ్యాంకర్లు. సంవత్సరం గడిచినా కొనుగోలుదారులకు అందని కన్‌ఫర్మేషన్‌ ఆర్డర్. కన్‌ఫర్మేషన్‌ ఇవ్వాలని కోరిన బ్యాంకర్లు. డిసెంబర్‌ 5న మరోసారి విచారిస్తామన్న హైకోర్టు. తదుపరి విచారణ డిసెంబర్‌ 5కు వాయిదా.
  • లోక్‌సభలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు. ప్రాంతీయ భాషా పరిరక్షణపై కేశినేని నాని ప్రశ్న. త్రిభాషా విధానాన్ని అమలు చేయాలి-కేశినేని నాని. ప్రాంతీయ భాషలను రక్షించాల్సిన అవసరం ఉంది-కేశినేని నాని. పలు అంశాలపై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు. విపక్ష సభ్యుల నినాదాల మధ్య కొనసాగుతున్న సభ. తెలుగు భాష ఉన్నతికి చర్యలు తీసుకుంటున్నాం-మంత్రి పోఖ్రియాల్‌.
  • ఆగ్రా జిల్లా పేరు మార్చే యోచనలో యూపీ సర్కార్. ఆగ్రా పేరును ఆగ్రావన్‌గా మార్చాలని యూపీ సర్కార్‌ యోచన. కాషాయికరణలో భాగంగా పేరు మారుస్తున్నారని విపక్షాల విమర్శలు. గతంలో ఫైజాబాద్‌ను అయోధ్యగా.. అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా మార్చిన యూపీ సర్కార్.

దిగ్వజయ యాత్ర.. మోడీ లక్ష్యం నెరవేరిందా ?

ఒకప్పుడు తనకు వీసా తిరస్కరించిన దేశంలో ఇపుడు గతంలో ఎవ్వరికీ దక్కనంత అపూర్వ స్వాగతం. ఏకంగా అమెరికా అధ్యక్షుడే ప్రోటోకాల్ ని పక్కన పెట్టి మరో దేశ అధినేత హాజరవుతున్న సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భం. సుమారు 50 వేల మంది హాజరైన స్టేడియంలో మోదీ.. మోదీ.. అంటూ వినిపిస్తున్న నినాదాల మధ్య చెరగని చిరునవ్వుతో కలియదిరిగిన అగ్ర రాజ్యాధినేత.. మోదీని ఆకాశానికెత్తేసిన ప్రసంగాన్ని భారతీయ పౌరులెవరు మర్చిపోలేరు. అయితే మోదీ లక్ష్యం ఇదేనా ? కాదన్నా దేశంలోనే జేజేలు కొట్టించుకునేందుకే అమెరికా వెళ్ళారా ? ఈ ప్రశ్నలకు ఇపుడిపుడే సమాధానం దొరుకుతోంది. ఆదివారం నాటి ఇద్దరు అధినేతల షో ఆద్యంతం రక్తి కట్టగా.. ఆ తర్వాత రెండ్రోజులకు గాని మోదీ అసలు లక్ష్యం తెర మీదికి రాలేదు. మంగళ వారం జరిగిన మోదీ, ట్రంప్ భేటీలో మోదీ పర్యటన అసలు లక్ష్యాన్ని చాటి చెప్పింది.

గత కొంత కాలంగా భారత్, అమెరికాల మధ్య వాణిజ్య రంగంలో అభిప్రాయం భేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. భారత్ లాంటి అతిపెద్ద మార్గెట్ ని వదులుకునేందుకు అమెరికా సిద్ధంగా లేదు. అయితే.. అమెరికన్ వస్తువుల మీద మన దేశం విధిస్తున్న పన్నులపై మాత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుస్సాతో వున్నారు. పన్ను తగ్గింపునకు ట్రంప్ చేసిన విజ్ఞప్తిని భారత్ తోసిపుచ్చడంతో అమెరికాలో భారత వస్తువులపై పన్నులను రెట్టింపు చేశారు. దాంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు తగ్గి దాని ఎఫెక్ట్ భారత ఆర్థిక వ్యవస్థపై పడుతుందని ట్రంప్ అనుకున్నారు. కానీ, పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. భారత వస్తువులను కొనేందుకు అమెరికన్లు సిద్ధపడ్డారు. అందుకోసం ఎక్కువ పన్ను చెల్లించేందుకు కూడా వెనుకాడలేదు. అదే సమయంలో అమెరికా నుంచి భారత్ కు దిగుమతి అయ్యే వస్తువులపై మన సర్కార్ పన్ను పెంచడంతో దిగుమతులపై ప్రభావం పడింది.. ఫలితంగా అమెరికాకు సీన్ రివర్స్ అయినట్టైంది.

మోదీ అమెరికా పర్యటన ఖరారు కాగానే తొలుత వినిపించింది వాణిజ్య ఒప్పందం సమీక్ష గురించే. ట్రంప్ కు మోదీ రాకను స్వాగతిస్తూ, వాణిజ్య ఒప్పందంపై క్లారిటీతో రావాలని ఆకాక్షించారు. అనుకున్నట్టుగానే మంగళవారం నాటి అధినేతల భేటీలో వాణిజ్య ఒప్పందంపై క్లారిటీ రావడం ఈ పర్యటన ద్వారా ఒక అపూర్వ ఘట్టం పూర్తయినట్టైంది. తాజా ఒప్పందంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరో అడుగు ముందుకేసినట్టయింది.

ఇక మరో ప్రధానమైన అంశం కశ్మీర్. గత రెండు నెలలుగా భారత్ తో పాటు పలు దేశాలు, పలు అంతర్జాతీయ వేదికలపైనా కశ్మీర్ అంశమే ప్రధాన చర్చనీయాంశం. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన తర్వాత జరిగిన జి7 సదస్సులోనే కశ్మీరుపై భారత వైఖరికి మద్దతు కూడగట్టగలిగారు. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తోను మోదీ భేటీ అయ్యారు. అనుకున్నట్టుగానే పుతిన్ మద్దతు పొందగలిగారు. అయితే రష్యా అనుకూలంగా స్పందించడంతో సహజంగానే అమెరికా వైఖరి మారుతుందా ? ఇమ్రాన్ ఎత్తుగడలకు ట్రంప్ లొంగుతాడా అన్న సందేహాలు తెరమీదికి వచ్చాయి. ఈ క్రమంలో మంగళవారం నాటి అధినేతల భేటీలో అనూహ్యంగా ట్రంప్.. మోదీ వైఖరిని పొగడ్తలతో ముంచెత్తడంతో పాటు కశ్మీర్ సమస్య పరిష్కారం మోదీ వల్లనే సాధ్యమౌవుతుందన్నారు. ఇంకో అడుగు ముందుకేసి, ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అంతమొందించడం మోదీతోనే అవుతుందని అత్యంత కీలకమైన కామెంట్ కూడా చేశారు ట్రంప్. ఇప్పటికీ అంతర్జాతీయంగా ఒంటరి అయినా పాకిస్తాన్ కు ట్రంప్ తాజాగా చేసిన కామెంట్స్ మరింత ఇబ్బంది కరంగా మారాయనడంలో సందేహం లేదు.

ఈరకంగా మోదీ పర్యటన ద్విముఖ లక్ష్యాన్ని సాధించింది అనడం సమంజసమే. వ్యక్తికత ఛరిస్మాను మరింత ఇనుమడింప చేసుకున్న మోదీ, భారత్ కు అత్యంత కీలకమైన ట్రేడ్ డీల్, కశ్మీర్ విషయాల్లో అమెరికా నుంచి సానుకూలతను రాబట్టారు. 2014 లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విదేశాంగ విధానానికి తనదైన శైలిలో పదును పెట్టిన మోదీ, తాజాగా దూకుడును పెంచారని చెప్పాలి.