మోదీ విదేశాంగ విధానం మారుతుందా ?

Modi Foreign Policy, మోదీ  విదేశాంగ విధానం మారుతుందా ?

రెండో సారి ప్రధాని పదవిని చేపట్టబోతున్న మోదీ అనుసరించే విదేశాంగ విధానం ఎలా ఉండనుంది ? ఇక ఈ పాలసీ ఎలా మారనుంది ? ఇప్పటివరకు ఆయన పలు విదేశీ పర్యటనలు చేశారు. వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యారు. అయితే ఆయా దేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాల్లో పెద్దగా పురోగతి లేదు. ప్రస్తుతం గల్ఫ్ లో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. కాస్త ‘ అటూ-ఇటూ ‘ గా ఉంది. ముఖ్యంగా ఇరాన్ నుంచి మనకు 60 శాతం ఆయిల్ దిగుమతులు జరుగుతున్నాయి. అయితే అమెరికా-ఇరాన్ మధ్య సంబంధాలు కూడా సందేహాస్పదంగా ఉన్న నేపథ్యంలో మోడీ ఈ విషయాన్నీ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. పైగా,,భారత్-అమెరికా మధ్య టారిఫ్ వార్ కూడా కొనసాగుతోంది యూఎస్ నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై భారత ప్రభుత్వం సుంకాలు పెంచడాన్ని ట్రంప్ సహించలేకపోతున్నారు. . అలాగే అమెరికా-చైనా మధ్య కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ మధ్య ఈ రెండు దేశాలూ దీనిపై దాదాపు టగ్ ఆఫ్ వార్ కొనసాగిస్తున్నాయి. ట్రంప్ , చైనా ప్రధాని లీ పింగ్ మాటల యుధ్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో భారత సంబంధాలు బాగానే ఉన్నా.. చైనా తో అప్పుడప్పుడు మన విభేదాలు కాస్త ఆందోళన కలిగించే అంశమే.. దీన్ని మోడీ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. చైనా-అమెరికా మధ్య వాణిజ్య లావాదేవీల ప్రభావాన్ని మోదీ అంచనా వేసి విదేశాంగ విధానంలో మార్పులు చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో మోదీ సెప్టెంబరులో భేటీ కానున్నారు. ఆ సందర్భంలో ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాల విషయం వారి మధ్య చర్చకు రావచ్చు ప్రస్తుతానికి ఆయిల్ దిగుమతుల అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ ..గల్ఫ్ దేశాలతో ‘ మైత్రి ‘ ని కొనసాగించవచ్ఛునని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోవడాన్ని, స్థూల దేశీయ వృద్ద్ధి రేటును ఆయా దేశాలు నిశితంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో మోదీ తన నూతన మంత్రివర్గంతో దీనిపై చర్చించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ఈ సవాళ్ళను ఆయన ఎలా అధిగమిస్తారో వెయిట్ అండ్ సీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *