సక్సెస్ రూట్ లో మోడెర్నా ‘కరోనా వ్యాక్సీన్’ ? కోతులపై ట్రయల్స్ !

కోవిడ్-19 పై పోరులో భాగంగా సమర్థమైన వ్యాక్సీన్ తయారీలో నిమగ్నమైన మోడెర్నా కంపెనీ.. తన తొలి ప్రయోగ ఫలితాలను ప్రకటించింది. 16 కోతులకు ఈ వ్యాక్సీన్ రెండు డోసులు ఇవ్వగా..

సక్సెస్ రూట్ లో మోడెర్నా 'కరోనా వ్యాక్సీన్' ? కోతులపై  ట్రయల్స్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 29, 2020 | 11:49 AM

కోవిడ్-19 పై పోరులో భాగంగా సమర్థమైన వ్యాక్సీన్ తయారీలో నిమగ్నమైన మోడెర్నా కంపెనీ.. తన తొలి ప్రయోగ ఫలితాలను ప్రకటించింది. 16 కోతులకు ఈ వ్యాక్సీన్ రెండు డోసులు ఇవ్వగా.. వాటిలో కరోనా వైరస్ పెరిగిన దాఖలాలు కనబడలేదని వెల్లడించింది. సాధారణంగా ఓ వైరస్ అదుపునకు వ్యాక్సీన్ ఇచ్చినప్పుడు ఒక్కోసారి వైరస్ పెరిగిపోతుందని, కానీ కోతుల్లో అలా జరగలేదని మోడెర్నా సంస్థ తెలిపింది. ఈ మేరకు తన ప్రయోగ ఫలితాలను న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించింది. వానరాలకు హై  డోసులు ఇవ్వగా ….అలా ఇచ్చిన రెండు రోజుల అనంతరం వాటి ముక్కుల్లో ఎలాంటి వైరస్ ఆనవాళ్లు కనబడలేదని, అలాగే వాటి లంగ్ ఫ్లూయిడ్ లో సైతం వైరల్ ‘రెసిప్లికేషన్’ కనిపించలేదని తెలిపింది. 16 కోతులూ ‘ప్రొటెక్షన్’ దశలోనే కనిపించాయి. ఈ ఫలితాలు మాలో ఆశలను చిగురిస్తున్నాయి అని ఈ కంపెనీ పేర్కొంది.

ఇక హ్యూమన్ ట్రయల్స్ కి వచ్ఛేసరికి మోడెర్నా.. 30 వేలమంది వలంటీర్లపై  వీటిని నిర్వహిస్తోంది. నవంబరు లేదా డిసెంబరులో మూడో దశ ట్రయల్ సందర్భంగా ఈ వ్యాక్సీన్ సేఫ్టీ నిర్ధారణ కానుంది. మోడెర్నా కంపెనీకి ట్రంప్ ప్రభుత్వం సుమారు వందకోట్ల డాలర్ల నిధులను అందజేసింది.