‘ఇది అధునాతన కిరాతకం’.. జార్జి ఫ్లాయిడ్ సోదరుడి ఆక్రోశం

తన సోదరుడు జార్జి ఫ్లాయిడ్ హత్య 'అధునాతన కిరాతకం' అని అతని తమ్ముడు ఫిలోనీస్ ఫ్లాయిడ్ ఆరోపించాడు. తన బ్రదర్ మృతికి కారకులైన పోలీసులను వదలరాదని కోరాడు. 'కేవలం 20 డాలర్ల కోసం..

'ఇది అధునాతన కిరాతకం'.. జార్జి ఫ్లాయిడ్ సోదరుడి ఆక్రోశం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 11, 2020 | 11:38 AM

తన సోదరుడు జార్జి ఫ్లాయిడ్ హత్య ‘అధునాతన కిరాతకం’ అని అతని తమ్ముడు ఫిలోనీస్ ఫ్లాయిడ్ ఆరోపించాడు. తన బ్రదర్ మృతికి కారకులైన పోలీసులను వదలరాదని కోరాడు. ‘కేవలం 20 డాలర్ల కోసం జార్జిని చంపుతారా ? ఇది సామూహికంగా కలిసి చేసిన హత్య’ అని పేర్కొన్నాడు. జార్జి మృతిపై అమెరికాలోని ప్రతినిధుల సభ ఏర్పాటు చేసిన జుడిషియల్  కమిటీ… తొలిసారిగా రేషియల్ ఇన్ జస్టిస్ (జాత్యహంకారం) పైన, పోలీస్ బ్రూటాలిటీ (పోలీసుల అమానుషం) పైన విచారణ జరిపింది. ఈ విచారణకు హాజరైన ఫిలోనీస్.. వాంగ్మూలమిస్తూ.. ‘ఇది పట్టపగలు జరిగిన మోడర్న్ డే లించింగ్’ అని పేర్కొన్నాడు. వాళ్ళు (పోలీసులు) జార్జిని కిరాతకంగా చంపారు అన్నాడు. గత మే 25 న మినియాపొలీస్ కి చెందిన పోలీసు ఒకడు జార్జి మెడపై తన కాలితో  తొమ్మిది నిముషాలసేపు నొక్కడంతో ఊపిరాడక అతడు మరణించాడు. జార్జి జీవితం అంతమై పోయిందని, తమ జీవితాలు కూడా నాశనమయ్యాయని ఫిలోనీస్ కన్నీటి పర్యంతమవుతూ వ్యాఖ్యానించాడు. బ్లాక్ లివ్స్ మ్యాటర్ అని ఆక్రోశించాడు. జార్జి గురించి డెరెక్ చౌవిన్ అనే ఆ పోలీసుకు తెలుసునని, తనను జార్జి ద్వేషిస్తున్నాడని తెలిసే ఆగ్రహంతో అతడ్ని హతమార్చాడని ఫిలోనీస్ అన్నాడు. కాగా- డెమొక్రాట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రతినిధుల సభ.. భారీ సంస్కరణల చట్టాన్ని ప్రతిపాదించి జులై 4 న దాన్ని ఓటింగ్ కి పెట్టనుంది. అయితే  చాలామంది రిపబ్లికన్లతో కూడిన సెనేట్ వారి ప్రతిపాదనను అడ్డుకునేందుకు కూడా రెడీగా ఉంది. ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా వారు కూడా ఓ బిల్లును తేవచ్ఛు.

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..