నగరంలో కదిలే ఇళ్లు.. ఖర్చు తెలిస్తే అవాక్కవుతారు..!

Mobile wooden housing new trend in Hyderabad, నగరంలో కదిలే ఇళ్లు.. ఖర్చు తెలిస్తే అవాక్కవుతారు..!

రోజురోజుకు పెరిగిపోతూ పోతున్న నిర్మాణ ఖర్చులకు ధీటుగా మెట్రో నగరాల్లో ఇప్పుడు మొబైల్ హౌసింగ్ అదృష్టంగా మారింది. ఇప్పటివరకు విదేశాల్లో మాత్రమే చూసే ఇటువంటి ఇళ్లు ఇప్పుడు మన హైదరాబా‌ద్ నగరంలో కూడా రూపుదిద్దుకుంటున్నాయి.
నగరంలో అన్ని సౌకర్యాలతో ఇల్లు నిర్మించాలంటే దాదాపు రూ.50 లక్షలు ఖర్చుపెట్టాల్సిందే. ఇంకా మంచి ఇళ్లు కావాలంటే కోటి వరకు ఖర్చవుతుంది. అయితే ఎంత ఖర్చుచేసినా ఆ ఇంటిని మరోచోటికి కదల్చలేని పరిస్థితి అయితే ఈ మొబైల్ ఇళ్లు మాత్రం ఎక్కడికైనా షిఫ్ట్ చేసుకోవచ్చు. కేవలం రూ.10 లక్షల్లో అందమైన ఆకర్షణీయమైన మొబైల్ గృహాలు నిర్మించుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్‌లో వీటికి డిమాండ్ పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

దీన్ని ఐరన్‌తో తయారు చేసి, విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న చెక్కను ఉపయోగించడంతో చెదలు పట్టే అవకాశాలు లేవంటున్నారు వీటిని రూపొందిస్తున్న టెక్నీషియన్లు. ఐదేళ్లకోసారి ఈ ఇళ్లకు పాలిష్ చేస్తే సరిపోతుందంటున్నారు.
అందంగా కనిపిస్తూ ముచ్చటగొలిపేలా ఉన్న ఈ మొబైల్ గృహాలు ప్రస్తుతం రిసార్టులు, హోటళ్లు, ఫామ్ ‌హోస్‌లలో వీటిని ప్రస్తుతం నిర్మిస్తున్నారు.  ఏది ఏమైనా నగరంలో ప్రస్తుతం ఈ నయా ట్రెండ్ హైదరాబాద్ నగర వాసులను మరింత ఆకర్షిస్తోంది. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు మాత్రం ఎక్కువగానే ఉన్నట్టుగా భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *