కేటు గాళ్లు కాదు…డుబ్లికేటుగాళ్లు.. మీ ఫోన్ జాగ్రత్త

మీరట్‌ పోలీస్‌లు చాకచక్యంగా బ్లాస్ట్‌ చేశారు. స్థావరంపై రైడ్‌ చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. అయితే సెక్యూరిటీ పరంగా ఈ విషయం చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని మీరట్‌ అడిషనల్‌ ఎస్పీ అఖిలేష్‌ నారాయణ సింగ్‌ హెచ్చరించారు.

కేటు గాళ్లు కాదు...డుబ్లికేటుగాళ్లు.. మీ ఫోన్ జాగ్రత్త
Follow us

|

Updated on: Jun 05, 2020 | 6:21 PM

కేటు గాళ్లకు కేటు గాళ్లు.. డుబ్లికేటుకు డుబ్లికేటుగాళ్లు.. డిజైన్‌కి డిటో డిజైన్‌గాళ్లు.. ఇలా అన్ని అయిపోయాయి.. ఇప్పుడు టెక్‌ కేటుగాళ్లు.. కొత్త అవతారం ఎత్తారు. IMEI కేటుగాళ్లు..  ఫోన్‌ నెంబర్లకు డుప్లికేట్‌ను సృష్టించారు. ఒకటికి ఒకటి కాదు.. ఒక నెంబర్‌కి ఏకంగా 13వేలు… అన్నింటికి ఒకే IMEI నెంబర్‌ని క్రియేట్‌ చేశారు. ఈ  IMEIనెంబర్‌తో 13వేల ఫోన్లను ఆపరేట్‌ చేస్తున్నారు.

ఈ విషయాన్ని రహస్యంగా తెలుసుకున్న మీరట్‌ పోలీస్‌లు చాకచక్యంగా బ్లాస్ట్‌ చేశారు. స్థావరంపై రైడ్‌ చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. అయితే సెక్యూరిటీ పరంగా ఈ విషయం చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని మీరట్‌ అడిషనల్‌ ఎస్పీ అఖిలేష్‌ నారాయణ సింగ్‌ హెచ్చరించారు. మొబైల్‌ IMEI నెంబర్‌ ఎప్పుడైనా టెర్రరిస్టుల చేతిలోకి వెళ్లిందంటే ఇక అంతే సంగతులంటున్నారు పోలీసులు.