మళ్లీ కంటైనర్ సెల్‌ఫోన్లు ఎత్తేశారు

మొబైల్ షాపులకు కన్నమేసి దుకాణంలో ఉన్న అరకొర సరకు రాత్రికి రాత్రి పట్టుకుపోయిన ఉదంతాలు చాలానే జరిగాయి. అయితే, ఇప్పుడు ఆరోజులు పోయాయి. కొంతకాలంగా మొబైల్ ఫోన్స్ దోపిడీలోకి మహాకేటుగాళ్లు, బడా జాదూగాళ్లు ఎంటరైపోయారు. చిల్లరమల్లర.. ఒకటీ అరా ఫోన్లకు కక్కుర్తి పడకుండా ఏకంగా కంటైనర్లకు కంటైనర్లే ఎత్తేస్తున్నారు. ఫ్యాక్టరీలనుంచి గొడౌన్లకు చేరకుండా మార్గమధ్యలోనే తమ చేతుల్లోకి తీసుకుని పనికానిచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే మళ్లీ తాజాగా తమిళనాడులో వెలుగుచూసింది. కృష్ణగిరి జిల్లాలోని జాతీయ రహదారిపై ప్రముఖ మొబైల్‌ […]

  • Venkata Narayana
  • Publish Date - 2:58 pm, Wed, 21 October 20

మొబైల్ షాపులకు కన్నమేసి దుకాణంలో ఉన్న అరకొర సరకు రాత్రికి రాత్రి పట్టుకుపోయిన ఉదంతాలు చాలానే జరిగాయి. అయితే, ఇప్పుడు ఆరోజులు పోయాయి. కొంతకాలంగా మొబైల్ ఫోన్స్ దోపిడీలోకి మహాకేటుగాళ్లు, బడా జాదూగాళ్లు ఎంటరైపోయారు. చిల్లరమల్లర.. ఒకటీ అరా ఫోన్లకు కక్కుర్తి పడకుండా ఏకంగా కంటైనర్లకు కంటైనర్లే ఎత్తేస్తున్నారు. ఫ్యాక్టరీలనుంచి గొడౌన్లకు చేరకుండా మార్గమధ్యలోనే తమ చేతుల్లోకి తీసుకుని పనికానిచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే మళ్లీ తాజాగా తమిళనాడులో వెలుగుచూసింది. కృష్ణగిరి జిల్లాలోని జాతీయ రహదారిపై ప్రముఖ మొబైల్‌ కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్స్‌ దోపిడి చేశారు. కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూర్‌ నుంచి ముంబయికి ఎంఐ మొబైల్స్‌ను తీసుకెళుతున్న కంటైనర్‌పై పంజా విసిరిన దొంగలు.. కృష్ణగిరి జిల్లా హోసూర్‌ సమీపంలో కంటైనర్‌ను అడ్డుకున్నారు. డ్రైవర్లను చిత కబాది సుమారు 15 కోట్ల రూపాయల విలువైన మొబైల్స్‌ను ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దోపిడీ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు జరగడంతో ఆ నేరాలకు, ఈ దోపిడీకి ఏమైనా సంబంధం ఉందా అనేకోణంలోనూ పోలీసులు దృష్టి సారించారు.  కంటైనర్ లారీ సెల్‌ఫోన్ల చోరీని ఛేదించిన పోలీసులు