Breaking News
  • అనంతపురం: ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ నిర్వాకం. పెనుకొండ దగ్గర నిలిచిపోయిన ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ బస్సు. రాత్రి నుంచి బస్సులోనే ప్రయాణికుల పడిగాపులు. బస్సును రోడ్డుపై వదిలి పరారైన డ్రైవర్‌, క్లీనర్‌. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు. మార్గం మధ్యలో బస్సుకు ఆరుసార్లు మరమ్మతులు. పట్టించుకోని ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపాలంటున్న ప్రయాణికులు.
  • చెన్నై ఐఐటీలో మరో వివాదం. ప్రాజెక్ట్ మేనేజర్‌ బెనర్జీపై విద్యార్థినుల ఫిర్యాదు. మొబైల్‌ఫోన్‌తో బాత్‌రూమ్‌లో వీడియోలు తీస్తున్నాడని ఆరోపణ. పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు. బెనర్జీ ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిన పోలీసులు. కేసునమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.
  • నెల్లూరు: మర్రిపాడు మండలం అల్లంపాడులో ముగ్గురు అరెస్ట్‌. గుప్తనిధులు తవ్వకాలు చేస్తున్నారన్న అనుమానంతో అరెస్ట్‌. పరారీలో మరో ఇద్దరు, కారు స్వాధీనం.
  • ప్రధాని అధ్యక్షతన 2016లో జరిగిన సమావేశంలో.. అన్నిరాష్ట్రాల్లో టెలీహెల్త్‌ సర్వీస్‌ ప్రారంభించాలని ఆదేశించారు. ఏపీ కార్మికశాఖ ఆధ్వర్యంలో ఈఎస్‌ఐ అధికారులతో సమావేశం నిర్వహించాం. తెలంగాణలో అమలులో ఉన్నందున అదే విధానాన్ని అమలు చేయమని చెప్పా. తెలంగాణ ఈఎస్‌ఐ అధికారులు టెలీ హెల్త్ సర్వీస్‌తో.. ఎంవోయూ చేసుకోమనడంతో నేను లెటర్‌ రాశా. నామినేషన్‌ పద్ధతిలో కాకుండా టెండర్ల పద్ధతి ద్వారా.. మందులు కొనుగోలు చేయాలని మంత్రిగా ఆదేశించా-అచ్చెన్నాయుడు.
  • కార్మికుల సొమ్ముదోచుకున్న అచ్చెన్నాయుడును వెంటనే అరెస్ట్‌ చేయాలి. ఈఎస్‌ఐ కుంభకోణాన్ని వెలికి తీయాలి-వైసీపీటీయూసీ నేత గౌతమ్‌రెడ్డి. ఇందులో ఎవరెవరు భాగస్వాములో కూడా వెల్లడించాలి. అచ్చెన్నాయుడును అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి-గౌతమ్‌రెడ్డి.

టీడీపీ-వైఎస్సార్‌సీపీ ట్వీట్ వార్… విజయసాయి కామెంట్లకు బుద్ధా కౌంటర్!

MLC Buddha Venkanna counters YSRCP MP Vijaya Sai Reddy tweets, టీడీపీ-వైఎస్సార్‌సీపీ ట్వీట్ వార్… విజయసాయి కామెంట్లకు బుద్ధా కౌంటర్!

టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. వైఎస్సార్‌సీపీ పై చంద్రబాబు, టీడీపీ నేతలపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం.. ఆ వెంటనే బుద్దా వెంకన్న కౌంటరివ్వడం మామూలే. తాజాగా విజయసాయి చంద్రబాబుపై చేసిన విమర్శలకు బుద్దా కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో కనీసం అపాయింట్‌మెంట్ కూడా దొరకలేదంటూ ఎద్దేవా చేశారు. ఇసుక సమస్యను ప్రస్తావిస్తూ వైఎస్సార్‌సీపీపై సెటైర్లు పేల్చారు.

‘ఢిల్లీలో కూర్చుని కాళ్ళు పట్టుకునే నీకు, అపాయింట్మెంట్ దొరక్క కాలుగాలిన పిల్లిలా పచార్లు చేస్తున్న మీ జగన్‌కి విశ్వసనీయత అర్ధం తెలుసనుకోవడంలేదు శకుని మామా విజయసాయిరెడ్డి! మీ తప్పుల్ని చంద్రబాబుగారు ఎండగడుతుంటే అంత ఉలిక్కిపడుతున్నావ్, త్వరలో తీహార్ వెళ్లాల్సి వస్తుందనా?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బుద్దా వెంకన్న.

‘దాదాపు 70 లక్షలమంది ఉపాధి కోల్పోయేలా చేసిన మీరు కూడా ఇసుక గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది శకుని మామా. తెదేపా హయాంలో చంద్రబాబుగారు ప్రజలకు ఉచితంగా ఇసుకని ఇచ్చారు. కార్మికుల కడుపు నింపారు. మీ జగన్ మాత్రం ఉన్న ఇసుకని కూడా లేకుండా చేసి కార్మికుల్ని నడిరోడ్డుమీద పడేసాడు. పిల్లికి బిచ్చం  పెట్టని మీరు పేదలకు పరమాన్నం పెడతారనుకోవడం భ్రమ శకుని మామా !’అని విజయసాయి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.

 

Related Tags