ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఎమ్మెల్సీ అశోక్‌బాబు సంచలన కామెంట్స్.. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్..

ఆంధ్రప్రదేశ్రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల వ్యవహారంపై ఎమ్మెల్సీ అశోక్‌బాబు తీవ్ర ఆరోపణలు చేశారు. ఏడాదిన్నరలో

ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఎమ్మెల్సీ అశోక్‌బాబు సంచలన కామెంట్స్.. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్..
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 22, 2020 | 11:22 AM

ఆంధ్రప్రదేశ్రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల వ్యవహారంపై ఎమ్మెల్సీ అశోక్‌బాబు తీవ్ర ఆరోపణలు చేశారు. ఏడాదిన్నరలో లక్షా 40 వేల కోట్ల రూపాయల అప్పునకు.. 70వేల కోట్ల పన్నుల భారాన్ని ప్రజలపై మోపారని మండిపడ్డారు. అయిదేళ్లలో పాలనలో జగన్ 7లక్షల కోట్లు అప్పులు చేసి జైలుకెళ్తే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని ఎత్తిపొడిచారు. ఇలాగైతే సామాన్యులపై అప్పుల భారం తడిసి మోపడవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ఆర్థికపరిస్థితి, అప్పులవ్యవహారంపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలకు కేంద్రం ఇచ్చిన రూ.1,250 కోట్లు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని కడిగేసారు. జాతీయ హెల్త్ మిషన్, 14వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన మొత్తంలో జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.950 కోట్లు మాత్రమేనని, మిగతా నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రకటనల కోసం రూ.160 కోట్లు ఖర్చు చేసి వాటిని కూడా ప్రజలపైనే మోపారని అన్నారు.