ఏపీలో కొనసాగుతున్న వైసీపీ వర్సెస్‌ ఎస్‌ఈసీ.. ఎన్నికల నిర్వహణపై మండిపడ్డ ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు

పీ పంచాయితీ ఎన్నికలుపై రగడ కొనసాగుతూనే ఉంది. ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వైఖరిపై వైసీపీ ఎమ్మెల్యే..

ఏపీలో కొనసాగుతున్న వైసీపీ వర్సెస్‌ ఎస్‌ఈసీ.. ఎన్నికల నిర్వహణపై మండిపడ్డ ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు
Follow us

|

Updated on: Jan 28, 2021 | 6:57 PM

ఏపీ పంచాయితీ ఎన్నికలుపై రగడ కొనసాగుతూనే ఉంది. ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వైఖరిపై వైసీపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ప్రభుత్వం వద్దని చెబుతున్నా ఎస్‌ఈసీ తన పంథంతో ఎన్నికలు పెడుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఓ వైపు కరోనాకి వ్యాక్సినేషన్‌ వేస్తుంటే మరోవైపు SEC ఎన్నికలు నిర్వహించడంపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే వెంక‌ట‌ నాగేశ్వరరావు. కరోనా వ్యాక్సిన్‌ వేసే సమయంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాడానికే SEC ఎన్నికలు నిర్వహిస్తొందని ఆరోపించారు..ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శంచుకున్న ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు చేసిన కామెంట్స్‌ ఇప్పుడు హాట్‌ టాఫిక్‌గా మారాయి..

రాష్ట్రంలోని మెజారిటీ పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయని తెలిపారు. లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల్లో టీడీపీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థులే లేరన్నారు. ప్రజలందరూ సీఎం జ‌గ‌న్ వైపే ఉన్నార‌నీ, వైసీపీకి ఓటు వేయ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని తెలియ‌జేశారు.

రాజ్‌భవన్‌కు చేరుకున్న బీజేపీ నేతలు.. కాసేపట్లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఇరు పార్టీల భేటీ

పంచాయతీల్లో మీకెందుకు ఓటెయ్యాలి.. ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం.. టీడీపీ మేనిఫెస్టో విడుదల