ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. ఇప్పటికి ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

  • Balaraju Goud
  • Publish Date - 11:06 am, Sat, 24 October 20

కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. ఇప్పటికి ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కాగా, తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ మహమ్మారి బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో శనివారం కరోనా టెస్టులు చేసుకోగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీనితో 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు. గత నాలుగైదు రోజులుగా కలిసిన కార్యకర్తలు నేతలు పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు తెలిపారు. కొన్ని రోజులుగా వల్లభనేని వంశీ ని కలిసిన కార్యకర్తలు అభిమానులు దీనితో ఆందోళన చెందుతున్నారు. అయితే, వంశీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.