ప్రొటెం స్పీకర్‌గా అప్పలనాయుడు..?

MLA Sambangi Appala Naidu, ప్రొటెం స్పీకర్‌గా అప్పలనాయుడు..?

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రొటెం స్పీకర్‌గా వైసిపి ఎమ్మెల్యే శంబంగి వెంకట్ చిన్న అప్పలనాయుడు వ్యవహరించే అవకాశం ఉన్నట్లు వైసీపీ శ్రేణుల సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి నుంచి ఫోన్ రావడంతో..  దాదాపు ఆయన ప్రొటెం స్పీకర్‌గా ఖరారైనట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం జిల్లా బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  పోటీ చేసిన అప్పలనాయుడు మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 12వ తేదీ నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండడంతో.. అప్పలనాయుడు శాసనసభ సమావేశాల తొలి రోజున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *