ముహూర్తం బావుంది.. కుర్చీలో కూర్చున్నా

ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్) చైర్‌పర్సన్‌గా నగరి ఎమ్మెల్యే రోజా బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి ఆటోనగర్‌లోని ఏపీఐఐసీ రాష్ట్ర కార్యాలయంలో తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్‌కు ఆమె కృతఙ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి జరిగేదని వెల్లడించిన ఆమె.. పెట్టుబడిదారులకు అన్ని రకాలుగా సహకరిస్తామని పేర్కొన్నారు. పారిశ్రామికీరణకు […]

ముహూర్తం బావుంది.. కుర్చీలో కూర్చున్నా
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 15, 2019 | 6:39 PM

ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్) చైర్‌పర్సన్‌గా నగరి ఎమ్మెల్యే రోజా బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి ఆటోనగర్‌లోని ఏపీఐఐసీ రాష్ట్ర కార్యాలయంలో తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్‌కు ఆమె కృతఙ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి జరిగేదని వెల్లడించిన ఆమె.. పెట్టుబడిదారులకు అన్ని రకాలుగా సహకరిస్తామని పేర్కొన్నారు. పారిశ్రామికీరణకు బడ్జెట్‌లో సీఎం పెద్దపీట వేశారని.. అన్ని జిల్లాల్లో పారిశ్రామిక రంగానికి కృషిచేస్తామని చెప్పుకొచ్చారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75శాతం అవకాశం ఉంటుందని.. పారదర్శకంగా భూముల కేటాయింపు జరుగుతుందని రోజా స్పష్టం చేశారు.

అయితే నగరి నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా.. జగన్ కేబినెట్‌లో తనకు స్థానం లభిస్తుందని ఆశించారు. కానీ మంత్రి వర్గంలో చోటు లభించకపోవడంతో ఆమె అలకబూనినట్లు వార్తలు వినిపించాయి. ఆ తరువాత రోజాను ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.