జగన్ దూరదృష్టికి హ్యాట్సాఫ్ అంటోన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా.. వాలంటీర్ల వ్యవస్థ ఎంతో ఉపయుక్తంగా ఉందని వ్యాఖ్య

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం ఎంపిడిఓ కార్యాలయంలో తుఫాను అవాంతరాలపై ఎమ్మెల్యే రోజా సమీక్ష..

  • Venkata Narayana
  • Publish Date - 9:49 pm, Sat, 28 November 20

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం ఎంపిడిఓ కార్యాలయంలో తుఫాను అవాంతరాలపై ఎమ్మెల్యే రోజా సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో చేపట్టిన చర్యలు.. ప్రస్తుత పరిస్థితుల గురించి ఆయాశాఖల అధికారులతో చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూరదృష్టితో ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ తీవ్ర కరోనా సమయంలోనూ, ప్రస్తుతం తుఫాను సమయంలోను ప్రజలకు విశేష సేవలు అందించారని అన్నారు. రాయలసీమలో కొన్ని జిల్లాలలో నివర్ తుఫాన్ ప్రభావంతో ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగినప్పటికీ నగరి నియోజకవర్గంలో అధికారులు సమన్వయంతో పని చేసినందున స్వల్పమైన నష్టాలతో బయట పడ్డామని రోజా అన్నారు.