ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి..?

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం ఇదే ప్రచారం ఏపీ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. శాసన మండలి రద్దుతో.. రోజాకు కలిసి వచ్చే ఛాన్స్‌ ఉందా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీలో మండలి రద్దు నేపథ్యంలో.. కేబినెట్ మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజీనామా చేస్తారా లేదా అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఎందుకంటే.. వైసీపీ ప్రభుత్వమే.. శాసన […]

ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి..?
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 04, 2020 | 10:06 AM

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం ఇదే ప్రచారం ఏపీ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. శాసన మండలి రద్దుతో.. రోజాకు కలిసి వచ్చే ఛాన్స్‌ ఉందా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీలో మండలి రద్దు నేపథ్యంలో.. కేబినెట్ మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజీనామా చేస్తారా లేదా అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఎందుకంటే.. వైసీపీ ప్రభుత్వమే.. శాసన మండలి రద్దు అంశాన్ని లేవనెత్తింది. అసెంబ్లీలో దీనిపై ప్రతిపాదన కూడా తీసుకొచ్చింది.

దీంతో.. మండలి సభ్యులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవిలతో రాజీనామా చేయిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని వైసీపీ పెద్దలు తీవ్రంగా చర్చిస్తున్నారాట. మండలి రద్దుకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఇద్దరు మంత్రులు కొనసాగడం నైతికంగా సరికాదనే వాదనే ముఖ్యమైన కారణమట. దీంతో.. త్వరలోనే ఈ ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయట.

ఆ ఇద్దరు మంత్రులు గనుక రాజీనామాలు చేస్తే.. ఆ తదుపరి పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ క్రమంలో కేబినెట్‌లో రెండు మంత్రి పదవులు ఖాళీ అవనున్న నేపథ్యంలో.. గతంలో ఈ పదవులు ఆశించి భంగ పడ్డవారికి ఇచ్చే ఆలోచనలో జగన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా రోజాకు మంత్రి పదవి దక్కే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

నిజానికి ఆమె తొలిసారి మంత్రివర్గంలోనే.. పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ ఆ లిస్ట్‌లో ఆమె లేరు. అనంతరం రోజాకు ఏపీఐఐసీ పదవిని కట్టబెట్టారు. ఆ పదవితో ఆమె సంతృప్తి చెందకున్నా.. సీఎం జగన్‌పై ఉన్న నమ్మకంతో రోజా ముందుకు సాగారు. అయితే ఇప్పుడు మాత్రం.. రోజా మంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. పలువురు రాజకీయ పండితులు తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు. చూడాలి మరి.. మంత్రి అయ్యే ఛాన్స్ రోజమ్మకు ఉందో లేదో.. మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.

పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్