టీషర్ట్‌తో ఎగ్జామ్ హాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే..గుర్తుపట్టారా?

Armoor MLA Jeevan Reddy takes LLM exam at Kakatiya University, టీషర్ట్‌తో ఎగ్జామ్ హాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే..గుర్తుపట్టారా?

టీ..షర్ట్‌తో ఎగ్జామ్ రాయడానికి ఎదురుచూస్తోన్న యువ ఎమ్మెల్యే ఎవరో గుర్తుపట్టగలరా?. ఎప్పుడూ వైట్ అండ్ వైట్ లో ఉంటూ డిబెట్లలో, పలు కార్యక్రమాలో పార్టీ వాయిస్‌ను గట్టిగా వినిపించే తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. అబ్బ ఇంకా గుర్తు పట్టలేదా?. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి.  ఎమ్మెల్యే అయ్యాక కూడా చదువు మీద తనకున్న ఆసక్తిని కోల్పోలేదు. కాకతీయ వర్సిటీలో ఎల్ ఎల్ ఎం చేస్తున్న ఆయన.. తాజాగా ఎగ్జామ్స్ రాశారు. ఇప్పటి వరకు జీవన్ రెడ్డి అన్ని పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యారు. ఎల్ఎల్ఎం పూర్తి చేసి అనంతరం పీహెచ్ డీ కూడా చేస్తానని ఆయన స్పష్టం చేశారు. పీహెచ్ డీ ద్వారా న్యాయవిద్యలో పరిజ్ఞానం మరింత పెరుగుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *