సింథటిక్‌ వాకింగ్‌ ట్రాక్‌ సూపర్‌ః ఎమ్మెల్యే హరీష్‌రావు

MLA Harish rao praises synthetic walking track
భద్రాకాళి చెరువుపై ఏర్పాటు చేస్తున్న బండ్‌..జిల్లా ప్రజలకే బ్రీతింగ్ హబ్ మారనుందన్నారు ఎమ్మెల్యే హరీష్‌రావు. వరంగల్‌ జిల్లాలో పర్యటించిన హరీష్‌ రావు…భద్రాకాళి చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్కును సందర్శించారు. ప్రత్యేకించి వాకర్స్‌ కోసం ఏర్పాటు చేసిన సింథటిక్‌ వాకింగ్‌ ట్రాక్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. మొకాళ్ల నొప్పులతో బాధపడే ప్రజలకు ఇక్కడి వాకింగ్‌ ట్రాక్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యంగా పిల్లలకు కూడా ఇక్కడ మంచి ప్లే గ్రౌండ్‌ అందుబాటులోకి రానుందన్నారు. ఈ సందర్బంగా హరీష్ రావు అక్కడ మొక్కలు నాటారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్నివిధాలా అబివృద్ధిలో దూసుకుపోతోందన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *