Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

రంగంలోకి బాలయ్య…అమరావతి గ్రామాల్లో పర్యటన

Nandamuri Balakrishna To Participate Amaravati Agitation, రంగంలోకి బాలయ్య…అమరావతి గ్రామాల్లో పర్యటన

ఏపీలో అమరావతి వార్ రోజురోజుకు వేడెక్కుతోంది. ఆ ప్రాంత రైతులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికి 28 రోజులుగా రైతులు వివిధ రూపాల్లో తమ వేదనను వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..రాజధాని గ్రామాల్లో కనుమ రోజున పర్యటించనున్నారు. ఆయనతో పాటు భార్య వసుంధర, కుమార్తె బ్రహ్మణి కూడా రాజధాని రైతులకు తమ మద్దతును తెలియజేయనున్నారు. తుళ్లూరుతో పాటు వెలగపూడి,  మందడం గ్రామాల్లో ఉన్న రైతుల నిరాహార దీక్ష శిబిరాలను బాలకృష్ణ సందర్శించనున్నారు.

కాగా ఒక్కొక్కరిగా సినీ నటులు అమరావతికి తమ మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే అగ్ర నిర్మాత అశ్వనీదత్, హీరో నారా రోహిత్, సింగర్ స్మిత, దర్శకుడు సతీశ్ వేగేశ్న రైతులకు సంఘీభావం ప్రకటించారు. తాజాగా బాలయ్య కూడా రంగంలోకి దిగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటివరకు బాలకృష్ణ రైతుల పక్షాన పోరాడేందకు రాకపోవడం, కనీసం మద్దతు తెలపకపోవడంతో పలువురు పెదవి విరిచారు. తాజా పర్యటనలో ఆయన వారికి వివరణ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.