9 పరుగులకే ఆలౌట్

పుదుచ్చేరి: 9 పరుగులకే ఆలౌటయ్యారు. 9 మంది డకౌట్ అయ్యారు. చేసింది 6 పరుగులే మరో మూడు పరుగులు ఎక్స్‌ట్రా రూపంలో వచ్చాయి. ఈ గణాంకాలతో ఆశ్చర్యపరిచిన క్రికెట్ మ్యాచ్ పుదుచ్చేరిలో జరిగింది. సీనియర్‌ ఉమెన్స్‌ టీ20 లీగ్‌లో భాగంగా మిజోరం-మధ్యప్రదేశ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మిజోరం మహిళా జట్టు కేవలం 9 పరుగులకే ఆలౌట్‌ అయింది. కేవలం ఒక్క బ్యాట్స్‌ ఉమెన్‌ మాత్రమే ఈ పరుగులైనా చేయగలిగింది. మొదటి నలుగురు బ్యాట్స్ ఉమెన్ డకౌట్ కాగా […]

9 పరుగులకే ఆలౌట్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 06, 2019 | 8:15 PM

పుదుచ్చేరి: 9 పరుగులకే ఆలౌటయ్యారు. 9 మంది డకౌట్ అయ్యారు. చేసింది 6 పరుగులే మరో మూడు పరుగులు ఎక్స్‌ట్రా రూపంలో వచ్చాయి. ఈ గణాంకాలతో ఆశ్చర్యపరిచిన క్రికెట్ మ్యాచ్ పుదుచ్చేరిలో జరిగింది. సీనియర్‌ ఉమెన్స్‌ టీ20 లీగ్‌లో భాగంగా మిజోరం-మధ్యప్రదేశ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మిజోరం మహిళా జట్టు కేవలం 9 పరుగులకే ఆలౌట్‌ అయింది. కేవలం ఒక్క బ్యాట్స్‌ ఉమెన్‌ మాత్రమే ఈ పరుగులైనా చేయగలిగింది.

మొదటి నలుగురు బ్యాట్స్ ఉమెన్ డకౌట్ కాగా ఐదో స్థానంలో వచ్చిన అపూర్వ భరద్వాజ్‌ 25 బంతిని భారీ షాట్ కొట్టింది. ఆ ఒక్క షాట్‌తో ఆరు పరుగులొచ్చాయి. ఇక అంతే. ఆ తర్వాతి బంతికే ఆమె కూడా ఔట్‌ అయింది. అపూర్వ తర్వాత క్రీజులోకి వచ్చిన వాళ్లంతా కూడా డకౌంట్ అయ్యారు. అపూర్వ కొట్టిన సిక్సర్‌తో పాటు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చిన మూడు పరుగులు కలుపుకుని 9 పరుగులు చేసి మిజోరం జట్టు ఆలౌట్‌ అయింది.