బాలీవుడ్ కు ‘మిథునం’ మూవీ..  గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాత్రలో బిగ్ బి 

లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేవలం గాయకుడిగానే కాదు.. సంగీత దర్శకుడిగా.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా.. నిర్మాతగా.. అన్నింటికి మించి ఆయనలో మంచి నటుడు ఉన్నారు...

  • Rajeev Rayala
  • Publish Date - 10:18 am, Sat, 28 November 20
బాలీవుడ్ కు 'మిథునం' మూవీ..  గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాత్రలో బిగ్ బి 

లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేవలం గాయకుడిగానే కాదు.. సంగీత దర్శకుడిగా.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా.. నిర్మాతగా.. అన్నింటికి మించి ఆయనలో మంచి నటుడు ఉన్నారు. ఆయన నటించిన ‘మిథునం’ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం,ఆయన భార్య పాత్రలో సీనియర్ నటి లక్ష్మి నటించారు. ఇపుడు సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ హిందీ రీమేక్‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ఎస్పీ బాలు పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఓ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా ఈ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకుందట.అమితాబ్ బచ్చన్ సరసన రేఖ నటించనున్నారని అంటున్నారు. మరో వైపు అమితాబ్ ఆయన భార్య జయాబచ్చన్ కలిసి నటించనున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. మరి అమితాబ్ ఎవరితో చేస్తారో చూడాలి.