‘బాల్ ఆఫ్ ది వరల్డ్ కప్’: మిచెల్ స్టార్క్

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం విదితమే. లక్ష్య చేధనలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు విఫలం కావడంతో ఆసీస్ విజయం సాధించి.. సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన బంతి మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు వరుసగా పెవిలియన్ బాటపట్టారు. ఈ దశలో బెన్ స్టోక్స్ జట్టుకు అండగా నిలిచాడు. […]

‘బాల్ ఆఫ్ ది వరల్డ్ కప్’: మిచెల్ స్టార్క్
Follow us

| Edited By:

Updated on: Jun 26, 2019 | 7:51 PM

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం విదితమే. లక్ష్య చేధనలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు విఫలం కావడంతో ఆసీస్ విజయం సాధించి.. సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన బంతి మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు వరుసగా పెవిలియన్ బాటపట్టారు. ఈ దశలో బెన్ స్టోక్స్ జట్టుకు అండగా నిలిచాడు. 8 ఫోర్లు, 2 సిక్సులతో అర్థశతకం సాధించిన స్టోక్స్ 115 బంతుల్లో 89 పరుగులు చేసి.. జట్టులో అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. జట్టుకు విజయాన్ని అందించే ప్రయత్నంలో… మిచెల్ స్టార్క్ వేసిన 37వ ఓవర్ చివరి బంతికి స్టోక్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అద్భుతమైన యార్కర్‌తో స్టార్క్.. స్టోక్స్‌ని పెవిలియన్ బాటపట్టించాడు.

కాగా ఈ బంతిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ బాల్‌ని.. బాల్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ప్రకటించాలని అభిమానులు అంటున్నారు. ‘‘క్రీజ్‌లో పూర్తిగా సెటిల్ అయిన బ్యాట్స్‌మెన్‌ని స్టార్క్ చాలా అద్భుతంగా ఔట్ చేశాడు’’ అని ఒకరు ట్వీట్ చేశాడు. ‘‘నేను చూసిన బెస్ట్ యార్కర్లలో ఇది ఒకటి’’ అని మరొకరు, అది బ్యాట్స్‌మెన్ తప్పు కాదు.. బౌలర్ గొప్పదనం’’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు.

'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..