పాడుబడ్డ బావిలో శవమై తేలిన పదో తరగతి బాలిక

బొమ్మలరామారం మండలం హజీపూర్ గ్రామానికి చెందిన శ్రావణి మండల కేంద్రంలోని పాఠశాలలో చదువుతోంది. ఇటీవలే తొమ్మిదో తరగతి పూర్తిచేసింది. అయితే.. పాఠశాలలో పదో తరగతికి సంబంధించి ప్రత్యేక క్లాసులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. బుధవారం (ఏప్రిల్ 24) ఉదయం స్పెషల్ క్లాసులని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన శ్రావణి.. ఆ తర్వాత తిరిగిరాలేదు. సాయంత్రం 5 గంటల సమయంలో గ్రామంలోని బస్టాప్ దగ్గర కనిపించినట్లు కొంత మంది స్థానికులు చెప్పారు. చీకటి పడుతున్నా తమ కుమార్తె ఇంటికి తిరిగి […]

పాడుబడ్డ బావిలో శవమై తేలిన పదో తరగతి బాలిక
Follow us

| Edited By:

Updated on: Apr 27, 2019 | 1:10 PM

బొమ్మలరామారం మండలం హజీపూర్ గ్రామానికి చెందిన శ్రావణి మండల కేంద్రంలోని పాఠశాలలో చదువుతోంది. ఇటీవలే తొమ్మిదో తరగతి పూర్తిచేసింది. అయితే.. పాఠశాలలో పదో తరగతికి సంబంధించి ప్రత్యేక క్లాసులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

బుధవారం (ఏప్రిల్ 24) ఉదయం స్పెషల్ క్లాసులని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన శ్రావణి.. ఆ తర్వాత తిరిగిరాలేదు. సాయంత్రం 5 గంటల సమయంలో గ్రామంలోని బస్టాప్ దగ్గర కనిపించినట్లు కొంత మంది స్థానికులు చెప్పారు. చీకటి పడుతున్నా తమ కుమార్తె ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఆమె ఆచూకీ కోసం గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం హజీపూర్ గ్రామంలోని ఓ పాడుబడ్డ బావి వద్ద శ్రావణి స్కూల్ బ్యాగ్ కనిపించింది. ఆ సమీపంలో శ్రావణి ఆనవాళ్ల కోసం గాలించగా ఫలితంలేకపోవడంతో.. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు పోలీసులు. దీంతో పాడుబడ్డ బావిలో శ్రావణి మృతదేహం లభ్యమైంది.

పోలీసులు బాలిక మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. శ్రావణి హత్య విషయం తెలియగానే గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. ఆగ్రహంతో భువనగిరి డీసీపీ వాహనంపై దాడి చేసి.. ధ్వంసం చేశారు. పోలీసులు గ్రామంలోని రాకుండా అడ్డుకుంటున్నారు. శ్రావణిని అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కేసు మిస్టరీని చేధించేందుకు నిందితులను పట్టుకునేందుకు ఐదు పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. టవర్ లొకేషన్ ఆధారంగా కాల్ డేటాలను విశ్లేషించే పనిలో పడ్డారు. మేడ్చల్‌ జిల్లా కీసరలోని సెరినిటీ ప్రైవేట్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి పూర్తిచేసింది. వారం రోజులుగా పాఠశాలలో నిర్వహిస్తున్న పదోతరగతి ‘ముందస్తు‘ తరగతులకు హాజరవుతోంది. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు ప్రతి రోజు ఆర్టీసీ బస్సులో వెళ్లి ఇంటికి చేరుకునేది. గురువారం ఆమె ఇంటికి చేరుకోలేదు. శుక్రవారం ఉదయం శ్రావణి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే ఆమె హత్యకు గురైందని తెలిసి గుండెలవిసేలా రోధిస్తున్నారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..