Breaking News
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఉద్రిక్తత. ధర్నాచౌక్‌ నుంచి మందడం బయల్దేరిన కర్నాటక రైతులు. అనుమతిలేదంటూ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.
  • చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. అమరావతి కార్యాచరణపై చర్చ.
  • మైలవరం ఫారెస్ట్ అధికారిపై వైసీపీ మండలాధ్యక్షుడు దాడికియత్నం. అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారి . ఫారెస్ట్‌ అధికారితో వాదనకు దిగిన వైసీపీ నేత పామర్తి శ్రీను.
  • ప.గో: చంద్రబాబుది యూటర్న్‌ గవర్నమెంట్‌ అయితే.. జగన్‌ది రద్దుల గవర్నమెంట్‌. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయి.. మండలిలోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అడుకుంటున్నారు. రాజకీయ పునరావాసానికి మండలి వేదికగా మారింది-బీజేపీ నేత అంబికా కృష్ణ.
  • తూ.గో: తునిలో కారులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు. మూడేళ్ల బాబును కారులో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఉక్కిరిబిక్కిరైన బాలుడు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు.

టీవీ9 స్టూడియో సాక్షిగా.. తల్లిదండ్రుల ఒడికి చేరుకున్న భవానీ..!

Bhavani Reached her Family Members, టీవీ9 స్టూడియో సాక్షిగా.. తల్లిదండ్రుల ఒడికి చేరుకున్న భవానీ..!

భవానీ.. చివరికి.. తల్లిదండ్రుల ఒడికి చేరుకుంది. 15 ఏళ్ల ఆమె నిరీక్షణకు శుభం కార్డు పడింది. భవానీని చూడగానే.. ఒక్కసారిగా కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. వారితో పాటు భవానీ కూడా కన్నీరు మున్నీరుగా విలపించింది.  చివరికి.. టీవీ9 స్టూడియోలో తల్లిదండ్రులను కలుసుకుంది భవానీ.  ఈ సందర్భంగా.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. టీవీ9కి, ఫేస్‌బుక్‌కి థాంక్యూ చెప్పుకున్నారు. మోహన్ వంశీ.. భవానీని ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు ప్రధాన పాత్ర పోషించారు.

శ్రీకాకుళం చీపురు పల్లిలో దాదాపు 15 ఏళ్ల కిందట భవానీ అదృశ్యమైంది. సోదరుడి వెంట స్కూల్‌కి వెళ్లి తప్పిపోయింది. ఆ తరువాత ఆమె కోసం ఎన్నో ఏళ్లుగా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో వారు తమ ఆశలు వదలుకున్నారు. పటమటలంకకు చెందిన మోహన్ వంశీ అనే వ్యక్తి… భవానీని ఆమె కుటుంబసభ్యులకు పరిచయం చేశాడు. తన ఇంట్లో పని చేసేందుకు వచ్చిన భవాని చరిత్రను శోధించిన వంశీ, భవాని చెప్పిన ఆధారాలతో సంబంధిత వ్యక్తుల కోసం అన్వేషణ ప్రారంభించాడు.

ఎట్టకేలకు అతడి అన్వేషణ ఫలించగా.. ఫేస్‌బుక్ ఆధారంగా భవాని కుటుంబాన్ని కనిపెట్టాడు. వెంటనే వారి కుటుంబసభ్యులకు వీడియో కాల్ చేశాడు. ఇన్ని రోజులు తను పడ్డ కష్టమంతా మర్చిపోయి, ఆనందంతో వారితో మాట్లాడింది భవాని. వీడియో కాల్‌లో భవానిని చూసి చీపురుపల్లి వాసులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ఆ యువతి తల్లిదండ్రులను కనుగొన్నందుకు మోహన్ వంశీ కుటుంబం కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది.