Breaking News
  • తెలంగాణ నీటిపారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు. జల వనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించిన సీఎం. ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంపు హౌజులు, ఆయకట్టు పెరిగినందున పనిభారం పెరిగింది. మారిన పరిస్థితికి అనుగుణంగా జల వనరుల శాఖలో సిఇలు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన పీఎం.
  • తెలంగాణకు మరో భారీ పెట్టుబడి: మెడికల్ డివైస్ తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మెడ్ ట్రానిక్స్ 1200 కోట్ల పెట్టుబడి. ఇప్పుడున్న తన అర్ అండ్ డి సెంటర్ ను 1200 కోట్లతో విస్తరించనున్న మెడ్ ట్రానిక్స్. అమెరికా అవతల మెడ్ ట్రానిక్ అతిపెద్ద అర్ అండ్ డి సెంటర్ ఇదే ఈ పెట్టుబడికి తెలంగాణ అనకూలమన్న కంపెనీ చైర్మన్ ఒమర్ ఇస్రాక్ రెండేళ్లుగా నిరంతరం కంపెనీతో చర్చిస్తున్న తెలంగాణ రాష్ర్టం. ఈ పెట్టుబడితో భారతదేశ మెడ్ టెక్ హబ్ గా హైదరాబాద్ మారుతుందన్న మంత్రి కెటియార్.
  • తెలంగాణకు మరో భారీ పెట్టుబడి: మెడికల్ డివైస్ తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మెడ్ ట్రానిక్స్ 1200 కోట్ల పెట్టుబడి. ఇప్పుడున్న తన అర్ అండ్ డి సెంటర్ ను 1200 కోట్లతో విస్తరించనున్న మెడ్ ట్రానిక్స్. అమెరికా అవతల మెడ్ ట్రానిక్ అతిపెద్ద అర్ అండ్ డి సెంటర్ ఇదే ఈ పెట్టుబడికి తెలంగాణ అనకూలమన్న కంపెనీ చైర్మన్ ఒమర్ ఇస్రాక్ రెండేళ్లుగా నిరంతరం కంపెనీతో చర్చిస్తున్న తెలంగాణ రాష్ర్టం. ఈ పెట్టుబడితో భారతదేశ మెడ్ టెక్ హబ్ గా హైదరాబాద్ మారుతుందన్న మంత్రి కెటియార్.
  • తెలంగాణ నీటిపారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు. జల వనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించిన సీఎం. ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంపు హౌజులు, ఆయకట్టు పెరిగినందున పనిభారం పెరిగింది. మారిన పరిస్థితికి అనుగుణంగా జల వనరుల శాఖలో సిఇలు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన పీఎం.
  • కేరళ : కేరళ రాష్ట్రం లోని మున్నారు లో విరిగిపడ్డ కొండ చరియలు కారణం గా ఇప్పటివరకు 52 మంది మృతి ,20 మంది గల్లంతు . గల్లంతయిన వారిలో 20 మంది కోసం కొనసాగుతున్న రెస్క్యూ . మృతి చెందినవారిలో ఎక్కువశాతం తమిళనాడుకి చెందిన వారే.
  • రాజధాని వికేంద్రీకరణ మరియు సిఆర్డిఏ రద్దు బిల్లుల పై కోర్టు లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు బాధ్యతలు మునిపల్ శాఖ కార్యదర్శి శ్యామల రావు కి అప్పగింత . అనేక డిపార్ట్మెంట్ లను ప్రతివాదులుగా చేరుస్తున్న నేపధ్యంలో కౌంటర్ అఫిడవిట్ కోసం శ్యామల రావును నామినేట్ చేసిన సర్కార్ . చీఫ్ సెక్రటరీ తో సహా మిగిలిన అధికారుల బదులు కౌంటర్ అఫిడవిట్ లో శ్యామల రావు సంతకం చేసేలా ఆదేశం. శ్యామల రావు అందుబాటులో లేని పక్షంలో మునిసిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రామ్ మనోహర్ రావు కు ఆ బాధ్యతలు . ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.
  • కడప జిల్లా: మాజీ మంత్రి సీనియర్ నేత ఖలీల్ బాష కన్నుమూత. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖలీల్ బాష. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన మాజీ మంత్రి.
  • ట్విట్టర్లో దూసుకెళ్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ట్విట్టర్ ఇండియా ట్రెండ్స్ లో 2 వ స్థానంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఇవాళ ఒక్కరోజే 70 వేలా ట్వీట్లతో దూసుకెళ్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఫలించిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మూడేళ్ళ కృషి. సెలబ్రిటీలు, వివిధ వర్గాల ప్రజల్లో గ్రీనరీ ఆవశ్యకతపై విశేష అవగాహన తీసుకొస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజనరీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై నెటిజెన్ల ప్రశంసల ఝల్లు.

రెండున్నరేళ్ల బాలుడు మిస్సింగ్‌..పట్టించిన వాట్సాప్‌

Missing children Social media back to parents, రెండున్నరేళ్ల బాలుడు మిస్సింగ్‌..పట్టించిన వాట్సాప్‌

కనిపించకుండా పోయిన రెండున్నరేళ్ల చిన్నారిని వెతికి పట్టించింది సోషల్‌ మీడియా. ఈ సంఘటన అనంతపురం జిల్లలో జరిగింది. ఇంటినుంచి తప్పిపోయిన ఓ బాలుడ్ని తిరిగి తల్లిదండ్రులకు వద్దకు చేర్చింది సోషల్‌ మీడియా. అనంతపురం రూరల్‌ సమీపంలోని కొడిమి క్రాస్‌ సెంటర్‌లో నివసిస్తున్నారు సురేష్‌బాబు కుటుంబం. సురేష్‌బాబు ఆటో డ్రైవర్‌..అతని కుమారుడు రెండున్నరేళ్ల తేజేశ్వర్‌ ఈ నెల 11న ఇంటి ముందు ఆడుకుంటూ తప్పిపోయాడు. ఉన్నట్టుండి బాబు కనిపించకుండా పోవడంతో సురేష్‌బాబు, స్థానికులు చుట్టుపక్కలంతా గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో రూరల్‌ పోలీస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు. 10 ప్రత్యేక బృందాలతో ప్రధాన కూడళ్లు, రైల్వే స్టేషన్‌, బస్టాండ్ల వద్ద ముమ్మర గాలింపు చేపట్టారు. బళ్ళారి రోడ్డులోని అన్ని గ్రామాలను గాలించారు. డ్రోన్ కెమెరాలు తెప్పించి బాలుడి ‘ఇంటి
చుట్టు పక్కల సుమారు ఐదు కిలోమీటర్ల వరకు జల్లెడ పట్టారు. 15 మంది ప్రత్యేక దళాలతో ఇంటి చుట్టు ప్రక్కల సుమారు ఐదు కిలోమీటర్ల వరకు అన్ని దిక్కులలోని వాగులు, వంకలు, ముళ్ళ పొదలు, రాళ్ళ గుట్ట ల లోను వెతికించారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో.. watsapp, facebook లద్వారా అన్ని  గ్రూపులలో పంపించి బాగా వైరల్ చేశారు. దీంతో బాలుడి ఆచూకీ ఫోన్ సమాచారం ద్వారా పోలీసులకు అందింది.

అసలేం జరిగింది…
కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి కాంట్రాక్ట్  పనులు చేసుకునే వాడు. తన వ్యక్తిగత పని మీద ఈ నెల 11న కళ్యాణదుర్గం నుండి కూడేరు మీదుగా అనంతపురము వెళ్తుండగా కొడిమి వద్ద రాత్రి సుమారు 8.20 గంటల సమయంలో బాలుడు ఏడుస్తూ కనిపించాడట. కాసేపు అక్కడ ఆగిచూస్తే..చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో ఆ బాలుడిని  తన స్కూటీపై ఎక్కించుకుని అనంతపురంలోని తమ ఇంటికి తీసుకెళ్ళాడు. మరసటి రోజు  ఉదయము తన స్వగ్రామానికి తీసుకెళ్లాడు. తనకు పెళ్లై తొమ్మిదేళ్లు అయినప్పటికీ..  పిల్లలు లేకపోవడంతో ఆ పిల్లవాడిని పెంచుకుందామని అనుకున్నారు. తరువాత వాట్సాప్,  ఫేస్ బుక్ ద్వారా బాలుడి ఫోటో ప్రచారం కావడంతో ఆ చిన్నారి తనవద్దే ఉన్నాడని పోలీసులకు సమాచారం అందించాడు. నవంబర్‌ 16న బాలుడిని పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వీర రాఘవ రెడ్డి వివరించారు. సోషల్ మీడియా ద్వారా నేటితరం యువత చెడు బారిన పడుతున్నారని ఆవేదనగా ఉన్నా,.. కొన్ని అంశాల్లో వాటిని సరిగా వినియోగిస్తే ఎంత మంచి జరుగుతుందో చెప్పేందుకు ఈ సంఘటనే ఉదాహరణగా నిలిచిందన్నారు.

Related Tags