‘కరోనా పిలిచింది’.. డాక్టర్ గా మళ్ళీ విధుల్లోకి..’మిస్ ఇంగ్లండ్’..

కరోనా బీభత్సం వేళ.. ఈ భారత సంతతి డాక్టర్ మళ్ళీ స్టెతస్కోప్ చేత బట్టింది. కరోనా రోగుల సేవే తన ధర్మంగా భావించింది. ఆమె పేరే భాషా ముఖర్జీ.. డాక్టర్ అయిన ఈమె కరోనా క్రైసిస్ నేపథ్యంలో ఇటీవలే ఇండియా నుంచి లండన్ చేరుకుంది..

'కరోనా పిలిచింది'..  డాక్టర్ గా మళ్ళీ విధుల్లోకి..'మిస్ ఇంగ్లండ్'..
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 08, 2020 | 11:43 AM

కరోనా బీభత్సం వేళ.. ఈ భారత సంతతి డాక్టర్ మళ్ళీ స్టెతస్కోప్ చేత బట్టింది. కరోనా రోగుల సేవే తన ధర్మంగా భావించింది. ఆమె పేరే భాషా ముఖర్జీ.. డాక్టర్ అయిన ఈమె కరోనా క్రైసిస్ నేపథ్యంలో ఇటీవలే ఇండియా నుంచి లండన్ చేరుకుంది.. కోల్ కతా లో పుట్టిన భాషా ముఖర్జీ,, తన విద్యాభ్యాసం రోజుల్లోనే బ్రిటన్ వెళ్ళింది. 24 ఏళ్ళ ‘భాషా’ .. గత ఏడాది ‘ మిస్ ఇంగ్లండ్’ గా కిరీటాన్ని దక్కించుకుంది. అయితే ఏ కారణం వల్లో స్టెతస్కోప్ వదిలి తన కెరీర్ ని ధార్మిక కార్యక్రమాల వైపు మళ్ళించుకుందట. కానీ…’కరోనా కాలం’ లో తిరిగి వైద్య వృత్తిలో ప్రవేశిస్తున్నానని ఆమె ప్రకటించింది. ఆఫ్రికా, టర్కీ దేశాలను సందర్శించిన ఆమె ఇండియాలో కొద్ధికాలం గడిపింది. ఈ దేశంలో సుమారు నాలుగు వారాల పాటు ఉన్నానని, అయితే బోస్టన్ నగరంలోని తన సహచరుల నుంచి మెసేజెస్ అందడంతో అక్కడికి చేరుకున్నానని భాషా ముఖర్జీ వెల్లడించింది. గత బుధవారం ఈ నగరంలో అడుగు పెట్టిన ఈమె ఒకటి రెండు వారాల పాటు సెల్హ్ ఐసోలేషన్ లో ఉందట. ఇక రోగుల సేవకు అంకితమవుతానని పేర్కొంది. బోస్టన్ లోని పిల్ గ్రిమ్ హాస్పిటల్ పేషంట్స్ ఈమె సేవలను పొందనున్నారు.