Minister Harish Rao: రైతులు దానిపై దృష్టిసారిస్తే బాగుంటుంది.. రైతు వేదిక ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు కామెంట్స్..

Minister Harish Rao: రైతులకు మంచి భవిష్యత్తు ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు.

Minister Harish Rao: రైతులు దానిపై దృష్టిసారిస్తే బాగుంటుంది.. రైతు వేదిక ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు కామెంట్స్..
Follow us

|

Updated on: Jan 23, 2021 | 1:09 PM

Minister Harish Rao: రైతులకు మంచి భవిష్యత్తు ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం నాడు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామంలో రైతు వేదికను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్ రావు ప్రసంగించారు. నందిగామ రైతు వేదిక జిల్లాలోనే చాలా అద్భుతంగా కట్టారని అధికారులకు కితాబిచ్చారు. ఇంతకాలం వ్యవసాయం దెబ్బ తింటూ వచ్చిందని, గత పాలకులు రైతులను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటు తరువాత కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకువచ్చిందన్నారు.

దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. వేల కోట్ల రుపాయలతో తమ ప్రభుత్వం రైతులను ఆదుకుందన్నారు. ఈ వేదిక రైతులకు ఉపయోగకరంగా ఉండాలని మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పామాయిల్ తోటలు బాగా పెంచుతున్నారని కితాబిచ్చారు. అయితే హైదరాబాద్ నగరానికి దగ్గర ఉన్నందున.. సేంద్రీయ వ్యవసాయం, కొత్త పద్ధతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. రైతు వేదికను ఎంత వాడుకుంటే అంత మంచి ఫలితాలు వస్తాయని మంత్రి హరీష్రావు అభిప్రాయపడ్డారు. రైతులతో మంచి చర్చా కార్యక్రమం చేపట్టాలని ఆయన సూచించారు. జహీరాబాద్‌లో అల్లం, ఆలుగడ్డలు పండించి మంచి లాభాలు పొందుతున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరినట్లుగా అమీన్‌పూర్‌లో మంచి రైతు వేదికను కట్టిస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.

Also read:

పంచాయతీ ఎన్నికలను స్వాగతించిన సీపీఐ.. ఎన్నికల నిర్వహణకు సీఎం జగన్‌ సహకరించాలన్న రామకృష్ణ

ఎన్నికలపై దృష్టి, అస్సాంలో పేదలకు భూపట్టాలను పంపిణీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, కోల్ కతాకు పయనం

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?