ఈ వయసులో పెళ్లెందుకన్న తల్లిదండ్రులు.. మనస్తాపంతో మైనర్ ప్రేమజంట ఆత్మహత్య

సినిమాల ప్రభావమో, సోషల్ మీడియా ఎఫెక్టో తెలియదు కానీ పిల్లలు స్కూల్ వయసు నుంచే ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారు. వద్దంటే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

  • uppula Raju
  • Publish Date - 4:00 pm, Mon, 23 November 20
ఈ వయసులో పెళ్లెందుకన్న తల్లిదండ్రులు.. మనస్తాపంతో మైనర్ ప్రేమజంట ఆత్మహత్య

సినిమాల ప్రభావమో, సోషల్ మీడియా ఎఫెక్టో తెలియదు కానీ పిల్లలు స్కూల్ వయసు నుంచే ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారు. వద్దంటే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇటువంటి సంఘటనే ఒకటి మహబూబ్‌గర్ జిల్లాలో జరిగింది. ఈ వయసులో ప్రేమ, పెళ్లి ఎందుకని తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నారు మైనర్ ప్రేమ జంట. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలోని వేముల గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఇంటర్ వరకు చదివాడు. అదే గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి చదివే అఖిల అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు కలిసి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటంబ సభ్యులకు తెలియడంతో ఈ వయసులో ప్రేమ, పెళ్లి ఏంటని మందలించారు. దీంతో ఇద్దరూ కలిసి గ్రామ పొలిమేరలో ఉన్నమామిడి తోటలో ఓ చెట్టుకు ఉరేసుకున్నారు. అయితే రాత్రిపూట తోట దగ్గర ఉన్న కాపాలాదారుడు చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్నతల్లిదండ్రులు విగత జీవులుగా పడి ఉన్న పిల్లలను చూసి తట్టుకోలేకపోయారు. గుండెలవిసేలా రోదించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.