Breaking News
  • మహబూబ్‌నగర్‌లో టెండర్‌ ఓటు నమోదు. 41వ వార్డులో 198వ పోలింగ్‌ కేంద్రంలో టెండర్‌ ఓటు నమోదు. ఘటనపై జిల్లా ఎన్నికల అధికారుల ఆగ్రహం. ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు. రీపోలింగ్‌ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం.
  • ల్యాండ్‌ పూలింగ్‌ సమయంలో చంద్రబాబు అనుచరులు భూములు కొన్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి-అంబటి. చట్టప్రకారం వాళ్లమీద యాక్షన్‌ తీసుకుంటాం-అంబటి. లోకేష్‌, చంద్రబాబు తాబేదారులు భూములు కొన్నారు-అంబటి.
  • కడప: ప్రొద్దుటూరులో ముగ్గురు క్రికెట్‌ బుకీల అరెస్ట్‌. రూ.2,68 లక్షలు స్వాధీనం.
  • ఏపీ హైకోర్టులో ఉత్కంఠ. సీఆర్‌డీఏ రద్దు, రాజధాని తరలింపు పిటిషన్ల కీలక విచారణ. వాదోపవాదాలు తెలుసుకోవటం కోసం వచ్చిన.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న.. మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహిత్గి.
  • ఎవరైనా చట్టాలకు లోబడే పనిచేయాలి. మండలిలో జరిగేది ప్రజలకు తెలియకూడదనే ప్రసారాలు నిలిపేశారు. మండలిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టం ప్రకారమే నడవాలి. మండలి చైర్మన్‌కు అధికార పార్టీ నేతలు నరకం చూపించారు. బిల్లును హడావుడిగా ఆమోదించుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు. బెయిల్‌పై ఉన్న విజయసాయిరెడ్డికి కౌన్సిల్‌లో ఏం పని. -ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, దీపక్‌, బచ్చులఅర్జునుడు, సత్యనారాయణరాజు.

మతిస్థిమితం లేని మైనర్‌ బాలికపై టైలర్ ఘాతుకం

Minor Girl Was Raped, మతిస్థిమితం లేని మైనర్‌ బాలికపై టైలర్ ఘాతుకం

మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. వరుస సంఘటనలు మరువక ముందే ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. కేబినెట్ సాక్షిగా ప్రభుత్వం దిశా చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రకటన వెలువడి 24 గంటలు దాటకుండానే చిత్తూరు జిల్లాలో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. మతిస్థిమితం లేని మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఎస్‌ఆర్‌పురం మండలం, పుల్లూరు క్రాస్ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది.

మతిస్థిమితంలేని బాలిక సోదరుడితో కలసి టైలరింగ్ షాప్‌కు వెల్లింది. టైలరింగ్ షాప్ వద్ద బాలికను సోదరుడు వదలి పెట్టి పనిమీద బయటకు వెళ్లాడు. ఆ తర్వాత టైలర్ బాబు అనే 42 ఏళ్ల వ్యక్తి బాలికకు మాయ మాటలు చెప్పి మిద్దిపైకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అప్పటికే ఆమె సోదరుడు అక్కడికి చేరుకోవడంతో విషయం బయట పడింది. దీంతో ఆగ్రహించిన బాలిక సోదరుడు టైలర్ బాబును చితక్కొట్టి పోలీసులకు అప్పగించాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షలు నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

Minor Girl Was Raped, మతిస్థిమితం లేని మైనర్‌ బాలికపై టైలర్ ఘాతుకం