బ్రేకింగ్: భానుప్రియకు పోలీసుల షాక్: అరెస్ట్‌ ఖాయమా..?

Minor girl harassment case against actor bhanupriya transferred to chennai, బ్రేకింగ్: భానుప్రియకు పోలీసుల షాక్: అరెస్ట్‌ ఖాయమా..?

నటి భానుప్రియను పోలీసు కేసు వెంటాడుతోంది. గతేడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్ సామర్లకోటలో భానుప్రియపై బాలకార్మికుల నేరం నమోదైంది. అయితే ఈకేసుకు సంబంధించి మొదటి ఫిర్యాదు చెన్నైలో నమోదవడంతో కేసును చెన్నైకు బదిలీ చేశారు పోలీసులు. పోస్టల్‌లో వచ్చిన ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఆధారంగా భానుప్రియపై 323, 506,341 సెక్షన్లతో పాటు 75, 79 జువైనల్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు పాండిబజార్‌ పోలీసులు.

చెన్నైలో ఉంటున్న భానుప్రియ మెడకు పోలీసు కేసు చుట్టుకుంటోంది. గత జనవరి 19న తన ఇంట్లో పని చేసే అమ్మాయి దొంగతనం చేసిందంటూ సోదరుడు గోపికృష్ణతో కలిసి పాండిబజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈకేసులో చోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న పనిపిల్ల తల్లి ప్రభావతి గతంలోనే సామర్లకోట పోలీసులకు భానుప్రియపై ఫిర్యాదు చేసింది. తన కూతుర్ని ఇంట్లో నిర్భంధించి చిత్రహింసలు పెడుతున్నారని కంప్లైంట్‌లో పేర్కొంది. తన కూతుర్ని రక్షించమని పనిపిల్ల తల్లి కోరింది.

ప్రభావతి ఇచ్చిన ఫిర్యాదుతో నటి భానుప్రియపై బాల కార్మికుల నేరం నమోదు చేశారు సామర్లకోట పోలీసులు. ఈ కేసులో భాగంగానే సామర్లకోట పోలీసులు.. చెన్నైకి వెళ్లి నటి భానుప్రియను విచారించారు. అదే సమయంలో భానుప్రియ పెట్టిన కేసులో చెన్నై, పాండిబజార్‌ పోలీసులు పనిపిల్ల, తల్లి ప్రభావతిని అరెస్ట్‌ చేసి విచారించారు.

గతేడాది నమోదైన కేసును సామర్లకోట పోలీసులు తాజాగా వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించిన నేరం జరిగింది చెన్నైలో కాబట్టి.. నటి భానుప్రియపై బాల కార్మికుల చట్టం కింద వారు నమోదు చేసిన కేసును చెన్నై పోలీసులకు ఇటీవల తరలించారు. దీంతో చెన్నై, పాండిబజార్‌ పోలీసులు ఆ కేసుకు సంబంధించి నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్‌పై కేసులు నమోదు చేశారు. దీంతో పోలీసులు ఏ క్షణంలోనైనా భానుప్రియను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *