ఆన్‌లైన్‌ క్లాసులకు స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని బాలుడి ఆత్మహత్య

నిరుపేద కుటుంబం అతని చదువుపాలిట శాపంగా మారింది. స్మార్ట్ ఫోన్ లేదని తీవ్ర మనస్తాపంతో పదోవ తరగతి విద్యార్థి క్లాసులకు అటెండ్ కాలేక బలవన్మరణాకి పాల్పడ్డాడు. అస్సాంలో జరిగిన ఈ ఘటన అందరిని కలచివేసింది.

ఆన్‌లైన్‌ క్లాసులకు స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని బాలుడి ఆత్మహత్య
Follow us

|

Updated on: Jun 24, 2020 | 10:02 PM

కరోనా మహమ్మారి ధాటికి స్కూళ్ల అన్నీ మూతపడ్డాయి. విద్యా సంవత్సరం మొదలు కావడంతో ఆన్‌లైన్‌ క్లాసులతో పిల్లలకు విద్యాబోధన స్టార్ట్ చేశాయి స్కూల్స్. స్మార్ట్ ఫోన్ లేని నిరుపేద విద్యార్థి క్లాసులకు అటెండ్ కాలేక బలవన్మరణాకి పాల్పడ్డాడు. అస్సాంలో జరిగిన ఈ ఘటన అందరిని కలచివేసింది.

అస్సాంలోని చిరంగ్‌ జిల్లాకు చెందిన ఓ బాలుడు (16) పదోవ తరగతి చదువుతున్నాడు. నిరుపేద కుటుంబం అతని చదువుపాలిట శాపంగా మారింది. బాలుడి తల్లి ఉపాధి కోసం బెంగళూరు వలస వెళ్లింది. తండ్రి ప్రస్తుతం ఏపని చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. అయితే విద్యా సంవత్సరం మొదలైందంటూ పాఠశాల నుంచి సమాచారం వచ్చింది. టెన్త్ క్లాస్ వారికి ఆన్‌లైన్‌ క్లాసులు బోధిస్తున్నట్లు చెప్పారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ ఉండాలని సూచించారు. దీంతో ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేందుకు స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వాలని తండ్రిని కోరాడు బాలుడు. ఇందుకు తండ్రి డబ్బులు లేవని తేల్చి చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.