Breaking News
  • అమరావతి: భూముల కొనుగోలుపై సీఐడీ కేసు నమోదు. ల్యాండ్‌ పూలింగ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సీఐడీ. 796 తెల్ల రేషన్‌కార్డు దారులపై కేసు నమోదు. రూ.3 కోట్లకు ఎకరం భూమి కొనుగోలు చేసిన తెల్ల రేషన్‌కార్డు దారులు. రూ.300 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్టు గుర్తించిన సీఐడీ. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసిన సీఐడీ. మొత్తం 129 ఎకరాలు కొన్న 131 మంది తెల్ల రేషన్‌కార్డుదారులు. పెద్దకాకానిలో 40 ఎకరాలు కొన్న 43 మంది. తాడికొండలో 180 ఎకరాలు కొనుగోలు చేసిన 188 మంది. తుళ్లూరులో 243 ఎకరాలు కొన్న 238 మంది. మంగళగిరిలో 133 ఎకరాలు కొనుగోలుచేసిన 148 మంది. తాడేపల్లిలో 24 ఎకరాలు కొన్న 49 మంది తెల్ల రేషన్‌కార్డు దారులు.
  • కడప: మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై అమరావతి జేఏసీ నేతల ఆగ్రహం. అమరావతి రాజధానిగా కొనసాగించే వరకు ఉద్యమాలు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం హర్షణీయం. మండలి చైర్మన్‌ పట్ల మంత్రుల తీరు బాధాకరం. ప్రజలే బుద్ధి చెబుతారు-జేఏసీ నేతలు రమణ, శ్రీనివాసులురెడ్డి.
  • నాపై ఆరోపణలు అవాస్తవం-ప్రత్తిపాటి పుల్లారావు. నాపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులపై న్యాయ పోరాటం చేస్తా. రాజధాని భూముల్లో అక్రమాలు జరిగితే కేసులు పెట్టండి. తప్పు చేయకుండా కేసులు పెట్టడం అన్యాయం-ప్రత్తిపాటి.
  • అమరావతి: మంగళగిరి టీడీపీ ఆఫీస్‌కు భారీగా రాజధాని రైతులు. చంద్రబాబు, లోకేష్‌ను అభినందించిన రైతులు, కార్యకర్తలు. లోకేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు, కార్యకర్తలు. రైతులకు మద్దతుగా జన్మదిన వేడుకలకు దూరంగా లోకేష్‌.
  • ప.గో: పాలకొల్లులో మండలి చైర్మన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జేఏసీ నేతలు, చైర్మన్‌కు బొకేలు ఇచ్చిన అభినందనలు తెలిపిన జేఏసీ నేతలు.

ముగ్గురు మంత్రులకు సీఎం షాక్.. రీజన్ సూపర్బ్ !

jagan shocks 3 ministers, ముగ్గురు మంత్రులకు సీఎం షాక్.. రీజన్ సూపర్బ్ !

ముగ్గురు మంత్రులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్  జగన్మోహన్ రెడ్డి షాకిచ్చారు. ఒక్క మంత్రికి మాత్రం పెద్ద పీట వేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన షాక్‌తో కుదేలైన మంత్రులు ముగ్గురు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తెగ తంటాలు పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంతకీ షాక్‌కు గురైన ఆ ముగ్గురెవరు ? ముఖ్యమంత్రి మెప్పు పొందిన ఒక్కరెవరు ? ఇదే ఇప్పుడు ఏపీవ్యాప్తంగా హాట్ టాపిక్.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జులై 4 న 13 జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను నియమించింది. నాలుగు నెలలు గడవక ముందే అక్టోబర్ 20 న ఇంఛార్జ్ మంత్రులను మార్చుతూ ఉత్తర్వులు జారీచేసింది. చిత్తూరు ఇంఛార్జ్ మంత్రి గౌతమ్ రెడ్డి మినహా అందరిని మార్చింది.. డిప్యూటీ సీఎం లు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని హోం మంత్రి సుచరిత లను బాధ్యతల నుంచి తప్పించింది.

ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రెవిన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ కసరత్తులో భాగంగా శాఖ పరంగా పని ఒత్తిడితో ఈ బాధ్యతల నుంచి తప్పించారు. ఆరోగ్య శాఖ మంత్రి శాఖపరమైన ఒత్తిడితో పాటు కొంత పనితీరులో వెనుకబడినట్లు తెలియడంతో బాధ్యతల నుంచి తప్పించారని ప్రచారం జరుగుతోంది. హోం మంత్రి సుచరిత కూడా శాఖ అంతగా పట్టు సాధించకపోవడంతో ఆమెను పక్కనపెట్టారట.

సంక్షేమ పథకాలు అమలుతో పాటు, వాటి పర్యవేక్షణ, లబ్ధిదారుల ఎంపిక, జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాల్లో ఇన్ ఛార్జ్ మంత్రులు పాత్ర చాలా కీలకం. వైసీపీ ప్రభుత్వం నవరత్నాల అమలు తో పాటు మేనిఫెస్టో అంశాలను వేగంగా అమలు చేస్తోంది. పని తీరులో కొందరు మంత్రులు వెనుకపడడంతో సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారట. అందుకే తక్కువ సమయంలోనే ఇంచార్జ్‌ మంత్రుల మార్పులు చేశారట. ఔట్ సోర్సింగ్ నియామకాలకు రాష్ట్ర స్థాయిలో డిసెంబర్1 నుంచి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు.

జిల్లా స్థాయిలో ఏర్పాటు అయ్యే ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ కు అనుబంధం గా ఇన్ ఛార్జ్ మంత్రుల నేతృత్వం ,కలెక్టర్లు ఎక్స్ అఫిషియో లుగా వ్యవహరించనున్నారు.. ఇకపై నియామకాలు అన్ని కార్పొరేషన్ ద్వారానే జరుగనున్నాయి.. జిల్లా స్థాయిలో పట్టు సాధించేందుకు ఇంచార్జ్‌ మంత్రుల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పనితీరు మెరుగు పర్చుకునేందుకు కొందరు మంత్రులకు సమయం ఇచ్చినట్లు సమాచారం. టార్గెట్లు రీచ్ కానీ మంత్రులను ఇంత దారిలోకి తెచ్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న దూకుడు  నిర్ణయాలు మంత్రులను షాక్‌కు గురి చేస్తున్నాయని అమరావతి వర్గాల భోగట్టా.