జిమ్‌లు, యోగా సెంటర్ల నిర్వాహకులకు మంత్రి కీలక సూచనలు

తెలంగాణలో ప్రవేశపెట్టనున్న కొత్త క్రీడా విధానంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రవీంద్రభారతిలోని క్రీడాశాఖ మంత్రి ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో..

జిమ్‌లు, యోగా సెంటర్ల నిర్వాహకులకు మంత్రి కీలక సూచనలు
Follow us

|

Updated on: Aug 01, 2020 | 6:42 PM

తెలంగాణలో ప్రవేశపెట్టనున్న కొత్త క్రీడా విధానంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రవీంద్రభారతిలోని క్రీడాశాఖ మంత్రి ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో మాజీ క్రికెట్ ప్రేయర్ మహ్మద్ అజహరుద్దీన్, టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, బ్యాడ్మింటన్ స్టార్ సిక్కిరెడ్డి, సాయి ప్రణీత్, సుమిత్ రెడ్డి, రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు జయేష్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎమ్.డీ.శ్రీనివాస్ రాజు, చాముండేశ్వరినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..

తెలంగాణలో ప్రక‌టించనున్న కొత్త క్రీడా విధానంపై రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందని తెలిపారు. అందుకోసం స్పోర్ట్స్ పాలసీపై తమ సలహాలు, సూచనలు ఇవ్వడానికి సీనియర్ ఆటగాళ్లు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. నూతన క్రీడా విధానం రూపకల్పనకు వారి నుంచి మంత్రి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఇకపోతే, ఈ నెల 5 నుంచి జిమ్‌లు, యోగా కేంద్రాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వాటి యాజమాన్యాలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక సూచనలు చేశారు.

తక్కువ మందితోనే వ్యాయామశాలలు, యోగా కేంద్రాలు నడిపించాలని మంత్రి సూచించారు. సోష‌ల్ డిస్టెన్స్ పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 5 నుంచి మైదానాలు, స్టేడియాల్లో క్రీడాకారులు ప్రాక్టీస్ మొదలు పెట్టవచ్చని తెలిపారు. అయితే, స్టేడియాల్లో టోర్నమెంట్ల నిర్వహణకు అనుమతి లేదని మంత్రి స్పష్టం చేశారు.