బస్తీ దవాఖానాలపై సమీక్ష.. రెండు రోజుల్లో మరో 10..!

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి కట్టడికోసం జిల్లా‌లో ఏర్పాటు చేసిన అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లు, బస్తీ దవాఖానాల ద్వారా అందుతున్న వైద్య సేవలు

బస్తీ దవాఖానాలపై సమీక్ష.. రెండు రోజుల్లో మరో 10..!
Follow us

| Edited By:

Updated on: Aug 05, 2020 | 7:45 PM

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి కట్టడికోసం జిల్లా‌లో ఏర్పాటు చేసిన అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లు, బస్తీ దవాఖానాల ద్వారా అందుతున్న వైద్య సేవలు, పనితీరు తదితర అంశాలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాసాబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రెండు రోజుల్లో మరో 10 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తామన్నారు. 85 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లతో పాటు ప్రస్తుతం 95 బస్తీ దవాఖానాల ద్వారా ప్రతిరోజూ వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు.

ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకే బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లు, బస్తీ దవాఖానాలలో అవసరమైన సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని వెల్లడించారు. జీహెచ్‌ఎంసి పరిధిలో డివిజన్‌కు 2 చొప్పున బస్తీదవాఖానాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. దీంతో హైదరాబాద్‌లో 168 బస్తీదవాఖానాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. 95 బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయన్నారు.

Read More:

మూడవ అతిపెద్ద హిందూ ఆలయంగా.. అయోధ్య..!

గుడ్ న్యూస్: 1167 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్