వద్దు.. రావద్దంటున్న మంత్రి.. వైరల్ వీడియో సెన్సేషనల్ !

హైదరాబాద్ రావొద్దు ! నేనే వస్తా! మీ సమస్యలు వింటా!  ఇవి ఓ మంత్రి నుంచి వచ్చిన మాటలు. ఆయన ఇలా ఎందుకు అన్నారు? దీని వెనుక ఏమైనా కథ ఉందా? అంటూ ఆయన వీడియో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఆ మంత్రి ఏమన్నారు? ఆయన మాటల వెనుక అర్ధం ఏంటి? ఇదిప్పుడు హాట్ టాపిక్కయ్యింది సిద్దిపేటలో. ఈపాటికే మీకర్థమై వుంటుంది ఈ మాటలెవరన్నది.. ఎస్.. ఈ మాటలన్నది ఆర్థిక శాఖా మంత్రి హరీశ్ రావే. ఆర్ధిక […]

వద్దు.. రావద్దంటున్న మంత్రి.. వైరల్ వీడియో సెన్సేషనల్ !
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 29, 2019 | 8:30 PM

హైదరాబాద్ రావొద్దు ! నేనే వస్తా! మీ సమస్యలు వింటా!  ఇవి ఓ మంత్రి నుంచి వచ్చిన మాటలు. ఆయన ఇలా ఎందుకు అన్నారు? దీని వెనుక ఏమైనా కథ ఉందా? అంటూ ఆయన వీడియో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఆ మంత్రి ఏమన్నారు? ఆయన మాటల వెనుక అర్ధం ఏంటి? ఇదిప్పుడు హాట్ టాపిక్కయ్యింది సిద్దిపేటలో. ఈపాటికే మీకర్థమై వుంటుంది ఈ మాటలెవరన్నది.. ఎస్.. ఈ మాటలన్నది ఆర్థిక శాఖా మంత్రి హరీశ్ రావే.

ఆర్ధిక మంత్రి హరీష్‌రావు మాటలు ఇవి. సిద్దిపేట అంటే హరీష్‌రావు. హరీష్‌రావు అంటే సిద్ధిపేట. అంతగా ఆయన పేరు పక్కనే ఆ ఊరు చేరింది. ప్రతిరోజూ ప్రజలకు అందుబాటులో ఉండడం ఆయనకు అలవాటు. మంత్రిగా రాజధానిలో ఉండాల్సి వచ్చినా.. ఆయన దృష్టంతా తన నియోజకవర్గ ప్రజలపైనే ఉంటుంది. అయితే ఆయనను కలిసేందుకు భారీగా ఖర్చు పెట్టుకుని హైదరాబాద్‌కు వచ్చే వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ విషయంలోనే హరీష్‌ రావు కాస్త ఆందోళన చెందుతుంటారు. డబ్బు ఖర్చుపెట్టుకుని తనను కలవడానికి రావొద్దని.. ఆదివారం తనను కలిసిన కార్యకర్తలకు సూచించారు హరీశ్.

ఏదైనా సమస్య ఉంటే సిద్దిపేటలోనే తనను కలవాలని.. వారంలో నాలుగు రోజులు అక్కడే ఉంటానని భరోసా ఇచ్చారు. ఆపద ఉన్నా.. ఆస్పత్రి పని ఉంటే మాత్రమే హైదరాబాద్‌కు రావాలని చెప్పుకొచ్చారు.   పొద్దునే ఐదు గంటలకు లేచి వచ్చి..ఐదు రూపాయలతో ఏదో ఒక బండి పట్టుకుని వచ్చి…పని కాకపోతే చాలా వరకు లాస్‌ అవుతారు. దీంతో పైసలు వేస్ట్‌. పనికాకపోతే టైమ్‌ వేస్ట్‌. సిద్దిపేట నుంచి వచ్చి పనికాకపోతే మనసు నొచ్చుకుంటారు.
మీరు బాధపడితే….నేను బాధ పడుతా..ఎందుకు ఇవన్నీ అంటూ కార్యకర్తకు హరీష్‌రావు సముదాయించి చెప్పడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సోషల్‌మీడియలో పోస్టుయైన ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. నాయకుడు అంటే ఇలాగే ఉండాలంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.