విద్యార్థుల డిమాండ్‌కు అనుగుణంగా యూనివర్సిటీస్ః మంత్రి సబితా

తెలంగాణ‌లో విద్యార్థుల డిమాండ్‌కు అనుగుణంగా ప్ర‌యివేటు యూనివ‌ర్సిటీల ప్రతిపాదనలను తీసుకువచ్చామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందుకు అనుగుణంగా రాష్ర్టంలో ప్రైవేటు యూనివ‌ర్సిటీల‌ను కూడా ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తెలంగాణ స్టేట్ ప్ర‌యివేటు యూనివ‌ర్సిటీస్ బిల్లుపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌బిత సమాధానమిచ్చారు.

విద్యార్థుల డిమాండ్‌కు అనుగుణంగా యూనివర్సిటీస్ః మంత్రి సబితా
Follow us

|

Updated on: Sep 14, 2020 | 2:31 PM

తెలంగాణ‌లో విద్యార్థుల డిమాండ్‌కు అనుగుణంగా ప్ర‌యివేటు యూనివ‌ర్సిటీల ప్రతిపాదనలను తీసుకువచ్చామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందుకు అనుగుణంగా రాష్ర్టంలో ప్రైవేటు యూనివ‌ర్సిటీల‌ను కూడా ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తెలంగాణ స్టేట్ ప్ర‌యివేటు యూనివ‌ర్సిటీస్ బిల్లుపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌బిత సమాధానమిచ్చారు.

దేశంలో ప్రాథ‌మిక విద్య‌లో వంద‌శాతం స్థూల జాతీయ న‌మోదు ఉన్నప్ప‌టికీ, మాధ్య‌మిక‌, ఉన్న‌త విద్య‌లో ఇది కొంత క్షీణించింద‌ని తెలిపారు. ఉన్న‌త విద్య‌ను అభ్యసించాల‌నుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున మరిన్ని యూనివర్సిటీలు రావల్సిన అవసరముందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న‌త విద్యా రంగం ప్ర‌భుత్వ ఆధీనంలోనే కొన‌సాగిందన్న మంత్రి.. మారుతున్న ప‌రిస్థితులకు అనుగుణంగా విద్యార్థుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఉన్న‌త విద్యలో ప్ర‌యివేట్ యూనివ‌ర్సిటీల అవ‌స‌రం ఉంద‌ని భార‌త ప్ర‌భుత్వం కూడా గుర్తించిందన్నారు. యూనివ‌ర్సిటీల‌తో పాటు డీమ్డ్ యూనివ‌ర్సిటీల‌ ఏర్పాటుకు కూడా కేంద్ర‌ ప్ర‌భుత్వం వెసులుబాటు క‌ల్పించింద‌న్నారు. ఆగ‌స్టు 8, 2020 నాటికి మ‌న దేశంలో 950 యూనివ‌ర్సిటీలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 53 సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలు, 412 స్టేట్ యూనివ‌ర్సిటీలు, 124 డీమ్డ్ యూనివ‌ర్సిటీలు, 361 ప్రైవేటు యూనివ‌ర్సిటీలు ఉన్నాయ‌ని మంత్రి తెలిపారు.

రాష్ర్టంలో ఉన్నత విద్య‌ను ప‌టిష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారన్న మంత్రి సబితా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన త‌ర్వాత స్కూల్ ఎడ్యుకేష‌న్‌, ఉన్న‌త విద్య‌ను, టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్‌ను బ‌లోపేతం చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించాల‌నే ఉద్దేశంతో గురుకులాల‌ను ప్ర‌వేశ‌పెట్టామ‌ని పేర్కొన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 959 గురుకులాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.

తెలంగాణ‌లో ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించే వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగడంతో, మన విద్యార్థులు ఇత‌ర రాష్ట్రాల వెళ్లకుండా ఇక్కడే ప్ర‌యివేటు యూనివ‌ర్సిటీల ప్ర‌తిపాద‌న‌ను తీసుకొచ్చామ‌న్నారు. తెలంగాణ‌లో ప్ర‌యివేటు యూనివ‌ర్సిటీల‌కు సంబంధించి మొత్తం 16 ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చాయ‌ని గుర్తు చేశారు. వీటిలో 8 ప్ర‌తిపాద‌న‌ల‌కు ప్ర‌భుత్వం ఒకే చెప్పింద‌ని మంత్రి.. ఇందులో 5 ప్ర‌యివేటు యూనివ‌ర్సిటీల‌కు ఇప్పటికే ఆమోదం తెలిపామన్నారు. మిగ‌తా మూడింటికి త్వ‌ర‌లోనే నాణ్యత ప్రమాణాలను పరిశీలించి అనుమతులివ్వడం జరుగుతుందన్నారు. ప్ర‌యివేటు యూనివ‌ర్సిటీల స్థానంలో దేశంలో తెలంగాణ 25వ స్థానంలో ఉంద‌ని మంత్రి స‌బిత పేర్కొన్నారు. అలాగే, రాష్ర్టంలో ప్రస్తుతం ఉన్న యూనివ‌ర్సిటీల‌ను ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేయ‌డం లేద‌న్నారు. త్వ‌ర‌లోనే వీసీల‌ను, అధ్యాప‌కుల‌ను భ‌ర్తీ పూర్తి చేస్తామ‌న్నారు. ఇప్ప‌టికే పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌కు అనుమ‌తులు మంజూరు చేశామ‌న్నారు.

పిల్లలకు పీపీఎఫ్ ఖాతా తీసుకోవచ్చా..? లాభాలు తెలిస్తే షాకవుతారంతే
పిల్లలకు పీపీఎఫ్ ఖాతా తీసుకోవచ్చా..? లాభాలు తెలిస్తే షాకవుతారంతే
ప్రతిరోజూ ఈ పనులు చేస్తే మీ బ్రెయిన్ ఖచ్చితంగా షార్ప్ అవుతుంది!
ప్రతిరోజూ ఈ పనులు చేస్తే మీ బ్రెయిన్ ఖచ్చితంగా షార్ప్ అవుతుంది!
విదేశీ టూర్ వెళ్తున్నారా? ఇది మీ వెంటే ఉండాల్సిందే..
విదేశీ టూర్ వెళ్తున్నారా? ఇది మీ వెంటే ఉండాల్సిందే..
భారతదేశంలో అత్యుత్తమ ప్రమాణాలతో 'కస్తూరి పత్తి'..దీని ప్రయోజనాలు
భారతదేశంలో అత్యుత్తమ ప్రమాణాలతో 'కస్తూరి పత్తి'..దీని ప్రయోజనాలు
వర్మ నా కోసం సీటు త్యాగం చేశారు.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
వర్మ నా కోసం సీటు త్యాగం చేశారు.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
ఆ పథకంలో పెట్టుబడితో లాభాల పంట.. రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ
ఆ పథకంలో పెట్టుబడితో లాభాల పంట.. రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ
మణికట్టుపై గూగుల్ మ్యాప్.. కొత్త ఫీచర్‌తో బోట్ స్మార్ట్ వాచ్..
మణికట్టుపై గూగుల్ మ్యాప్.. కొత్త ఫీచర్‌తో బోట్ స్మార్ట్ వాచ్..
నోట్లో పెట్రోల్ పోసుకుని స్టంట్ చేస్తూ గాయపడ్డ యువకుడు
నోట్లో పెట్రోల్ పోసుకుని స్టంట్ చేస్తూ గాయపడ్డ యువకుడు
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి
మనం తినే గుత్తి వంకాయ కర్రీకి 4000 ఏళ్ల చరిత్ర ఉందట..
మనం తినే గుత్తి వంకాయ కర్రీకి 4000 ఏళ్ల చరిత్ర ఉందట..
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.