Minister Perni Nani: చంద్రబాబు విశ్వాసం పొందేందుకే ఎన్నికల నోటిఫికేషన్.. ఎస్ఈసీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి నాని..

Minister Perni Nani: ఆంధప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Minister Perni Nani: చంద్రబాబు విశ్వాసం పొందేందుకే ఎన్నికల నోటిఫికేషన్.. ఎస్ఈసీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి నాని..
Follow us

|

Updated on: Jan 10, 2021 | 8:02 PM

Minister Perni Nani: ఆంధప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం నాడు గుడివాడలోని కే కన్వేన్షన్ గ్రౌండ్‌లో ఎన్టీఆర్ టూ వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాడుగు పోటీలను మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఎస్ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎస్ఈసీ దిగజారుడు రాజకీయాలు చేయడం దారుణం అన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణించారు. దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తితో పాటు.. కొత్త స్ట్రెయిన్ అడుగుపెట్టిన దృష్ట్యా ఎన్నికలను తర్వాత నిర్వహించాలని భావిస్తున్నామని మంత్రి నాని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కోటి మందికి కరోనా వ్యాక్సిన్ వేయాల్సి ఉందన్నారు. చంద్రబాబు విశ్వాసం కోసం నిమ్మగడ్డ రమేష్ మూర్ఖంగా ఎన్నికల నిర్వాహణకు పూనుకున్నారని మంత్రి నాని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించడాన్ని ఖండిస్తున్నామన్నారు.

అంతేకుకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగ వర్గాలుకూడా సముఖంగా లేవని మంత్రి నాని చెప్పారు. దేవాలయాలను కూల్చి, టాయిలెట్లు నిర్మించిన చంద్రబాబు.. నేడు హైందవ ధర్మం గురించి మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దిగజారి ప్రవర్తించడం రాజకీయాల్లో మరణంతో సమానం అని పేర్కొన్నారు. అధికార కాంక్షతో, రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకే టీడీపీ నాయకులు ఎన్నికలను కోరకుంటున్నారని మంత్రి విమర్శించారు. నిమ్మగడ్డ రమేష్, టీడీపీ కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టలేమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలను నిర్వహించం అని మంత్రి పేర్ని నాని తేల్చి చెప్పారు. ప్రజల ప్రాణాల రక్షణ కోసం కోర్టులను ఆశ్రయిస్తామన్నారు. వ్యాక్సినేషన్ తరువాతే ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని మంత్రి నాని ఫైర్ అయ్యారు.

Also read:

కొంపముంచిన కామక్రీడ.. శృంగారంలో పీక్స్ చేరాలని ప్రియుడిని నైలాన్ తాడుతో కట్టింది.. తీరా చూస్తే.!

దొంగిలించిన సొమ్ముతో పేదలకు సాయం, ఛారిటీలకు విరాళం, ఢిల్లీలో అభినవ ‘ రాబిన్ హుడ్ ‘అరెస్ట్

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..