కేటీఆర్ సంతకం ఫోర్జరీ: మహిళ నిర్వాకం!!

మంత్రి కేటిఆర్ సంతకాన్ని.. లెటర్ హెడ్‌పై ఫోర్జరీ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. విద్యా వ్యవస్థకే మచ్చ తీసుకువచ్చిన మహిళ మంగళను సస్పెండ్ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనలో డీఈవో కార్యాలయ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళ ఓ పభుత్వ స్కూల్‌కి హెడ్‌ మాస్టర్. అదే విధంగా.. ఓపెన్ స్కూల్స్‌కి కోఆర్డినేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా.. ఆమెను కోఆర్డినేటర్ పోస్ట్ నుంచి తప్పించాలని.. […]

కేటీఆర్ సంతకం ఫోర్జరీ: మహిళ నిర్వాకం!!
Follow us

| Edited By:

Updated on: Oct 04, 2019 | 1:51 PM

మంత్రి కేటిఆర్ సంతకాన్ని.. లెటర్ హెడ్‌పై ఫోర్జరీ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. విద్యా వ్యవస్థకే మచ్చ తీసుకువచ్చిన మహిళ మంగళను సస్పెండ్ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనలో డీఈవో కార్యాలయ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మంగళ ఓ పభుత్వ స్కూల్‌కి హెడ్‌ మాస్టర్. అదే విధంగా.. ఓపెన్ స్కూల్స్‌కి కోఆర్డినేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా.. ఆమెను కోఆర్డినేటర్ పోస్ట్ నుంచి తప్పించాలని.. విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. అయితే.. మంగళ అనుకోని విధంగా.. విద్యాశాఖ అధికారులకు షాక్ ఇచ్చింది. మంత్రి కేటీఆర్.. సంతకం చేసిన ఓ లెటర్‌‌ హెడ్‌ను అధికారులకు ఇచ్చింది. దీన్ని చూసిన వారు.. షాక్‌ అయి.. మళ్లీ ఆమెకే ఆ పదవి కేటాయించారు.

అయితే.. దీనిపై దర్యాప్తు చేసిన విద్యాశాఖ అధికారులు.. ఆ సంతకం కేటీఆర్‌ది కాదని.. ఫోర్జరీ చేసిందని తెలుసుకున్నారు. మంగళను నిలదీయగా.. అసలు విషయం బయటపడింది. ఆ లెటర్ హెడ్‌పై కేటీఆర్ సంతకం చేయలేదని.. మంగళనే స్వయంగా.. రికమెండేషన్ లెటర్‌ను సృష్టించుకొని.. ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసిందని అధికారులు చెబుతున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు అధికారులు ఆమెను విధులనుంచి బహిష్కరించాలని.. రాష్ట్ర ఓపెన్స్ సొసైటీ కమిషనర్‌కి దృష్టికి తీసుకెళ్లారు.