యురేనియం తవ్వకాలకు నో పర్మిషన్

Minister KTR Says No permission For Uranium Mining, యురేనియం తవ్వకాలకు నో పర్మిషన్

యురేనియం తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. అంతేకాదు భవిష్యత్తులోనూ యురేనియం తవ్వకాలకు ఎలాంటి అనుమతులను ఇవ్వబోదని స్పష్టం చేశారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన యురేనియం తవ్వకాల విషయంపై మాట్లాడారు. 2016 లోనే అన్వేషణకు అనుమతిచ్చిన వన్యప్రాణుల సంరక్షణ విభాగం.. తవ్వకాలకు అనుమతివ్వలేదన్నారు. యురేనియం నిక్షేపాల కోసం నల్గొండ జిల్లాలో అన్వేషణ చేపట్టినా.. నాగర్‌కర్నూల్‌- అమ్రాబాద్‌ ప్రాంతంలో ఎలాంటి అన్వేషణ చేపట్టలేదని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో నిక్షేపాలున్నప్పటికీ అనుమతులివ్వబోమని వన్యప్రాణుల సంరక్షణ విభాగం స్పష్టం చేసిందన్న విషయాన్ని సభలో ఆయన గుర్తు చేశారు.

గతకొద్ది రోజులుగా యురేనియం తవ్వకాల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ యురేనియం తవ్వకాలను నిలిపివేయాలంటూ సేవ్ నల్లమల్ల కార్యక్రమానికి ప్రణాళికలు రచించారు. అంతేకాదు ఈ ఉద్యమానికి కమిటీ కూడా వేశారు. మరోవైపు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా సేవ్ నల్లమల్ల అంటూ ఉద్యమం చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *